ఏపీ సీఎంగా అధికారిక విధుల్లో బిజీగా ఉన్నందున తన వ్యక్తిగత హాజరునకు మినహాయింపు ఇవ్వాలని సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్ విన్నవించుకున్నారు. తన తరపున న్యాయవాది జి అశోక్ రెడ్డి హాజరయ్యేందుకు అనుమతించాలని కోరారు. దీనిపై సీఆర్ పీసీ సెక్షన్ రెండు వందల ఐదు కింద హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో గురువారం పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రిగా అధికారిక వ్యవహారాల్లో పాల్గొనాలి ఎక్కువ సమయం పరిపాలనకు కేటాయించాలి. పైగా తరచుగా హైదరాబాదులో కోర్టు విచారణకు హాజరు కావడం వల్ల పరిపాలన దెబ్బతినే అవకాశముంది. ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా బాగోలేదు, సీఎం హోదాలో ఉన్నందున కోర్టుకు హాజరు కావాలంటే ప్రోటోకాల్ తో పాటు భద్రతకూ భారీగా వ్యయం అవుతోంది అని పిటిషన్ లో వివరించారు.తన వ్యక్తిగత హాజరు అవసరమని భావించి కోర్టు ఆదేశించినప్పుడు తప్పకుండా వస్తానన్నారు.


ప్రతి వాయిదాకూ నిందితుల హాజరు అక్కర్లేదని బస్వరాజ్, ఆర్ పాటిల్, భాస్కర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కేసులో సుప్రీం కోర్టు స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ఈ పిటిషన్ ను న్యాయస్థానం శుక్రవారం విచారించే అవకాశముంది. ఇదిలా ఉండగా తన తరఫున న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతించాలంటూ దాఖలు చేసుకున్న పిటిషన్ ను రెండు వేల పద్నాలుగులో ఇదే కోర్టు తిరస్కరించగా హై కోర్టు సమర్థించింది. ఇదిలా వుంటే ఇంత బిజీ సీఎం గారు మరిక్కడ చేసింది ఏమిటో సాధించిన ప్రగతి ఎంతో ఒకసారి పరిశీలిస్తే తెలిసే వాస్తవాలూ ఇవి. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పాత ప్రభుత్వంలోని మంచి చెడ్డలను సమీక్షించడం సహజమే, మంచిని కొనసాగించటం చెడు ఉంటే ఆపేయడం మామూలే. అయితే కొత్త సర్కార్ మంచీ చెడూ విచక్షణ ప్రదర్శించకుండా అన్నిటినీ ఒకే గాటన కట్టేసింది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


చంద్రబాబు సర్కారు సంపద సృష్టి మంత్రం జపించగా, జగన్ ప్రభుత్వం ఇప్పటి దాకా దీనిపై దృష్టి సారించడం లేదు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి బాటలు వేసే కార్యక్రమాల్లో బ్రేక్ పడిందన్న భావన ప్రజల్లో నెలకొంది. మొత్తం రాష్ర్టానికే ప్రధానాకర్షణగా ఒక ఆర్థిక చోదకశక్తిగా మారాల్సిన అమరావతి ప్రణాళిక ఇప్పుడు మూలనపడిపోయింది. ఎన్నికల ముందు దాకా పరుగులు తీసిన పోలవరం ప్రాజెక్ట్ రివర్స్ దెబ్బతో నిలిచిపోయింది. పవన సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై పీపీఏలపై పునఃసమీక్ష నిర్ణయం జాతీయ స్థాయితో పాటు అంతర్జాతీయం గానూ వివాదాస్పదంగా మారింది.అవినీతిపై చర్యలు తీసుకుంటే సరే కానీ పాత పనులన్నిటినీ నిలిపివేయటం గత నిర్ణయాలను తవ్వుకుంటూ పోవడం సరికాదు. ఇలా చేస్తే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రారు. అన్ని పరిశ్రమ వర్గాలు కూడా తేల్చి చెప్పేశాయి. మ్యానిఫెస్టో నాకు భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని ముఖ్యమంత్రి జగన్ తొలి నుంచీ చెబుతూ వస్తున్నారు. ఎన్నికల హామీల అమలు దిశగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలంటూ అధికారులకు స్పష్టం చేశారు. నవరత్నాల అమలు తమ అజెండా అని తేల్చి చెప్పారు.



కొన్ని సంక్షేమ పథకాలకు మరింత ప్రయోజనం జోడించారు, కొన్నిటిని ఆపేశారు. పింఛను మొత్తాన్ని రెండు వేల నుంచి రెండు వేల రెండు వందల యాభై చేశారు. అత్యంత కీలకమైన రైతు భరోసా, అమ్మ బడి కార్యక్రమాల అమలుకు భవిష్యత్ తేదీలు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన కొంత కాలం తరువాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో బదిలీలు జరిగాయి. అఖిల భారత సర్వీసు అధికారులతో పాటు డీఎస్పీ ఆర్డీవోల బదిలీలు ముఖ్యమంత్రి కార్యాలయం స్వయంగా నిర్ణయించింది. ఇక కింది స్థాయి అధికారిక యంత్రాంగం బదిలీలను ఆయా శాఖలకు అప్పగించేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: