విశాఖను ఐటీ రాజధానిగా చేయాలని జగన్ సర్కార్ డిసైడ్ అయింది. అన్ని విధాలుగా ఐటీకి విశాఖ అనుకూలం అన్నది అందరికీ తెలిసిందే. ఉమ్మడి ఏపీలో కూదా హైదరాబాద్ తరువాత విశాఖనే ఐటీకి కేరాఫ్ గా భావించేవారు. ఆనాటి పాలకుల్లో ఒక్క వైఎస్సార్ కొంత ముందు చూపుతో విశాఖలో ఐటీ పార్క్ ఏర్పాటు చేసి కొన్ని సాఫ్ట్ వేర్ పరిశ్రమలు అడుగుపెట్టేలా చేశారు.  విశాఖ బీచ్ రోడ్డు  రుషికొండ వద్ద నాటి వైఎస్సార్ చేసిన ఐటీ అభివ్రుధ్ధి స్పష్టంగా కనిపిస్తుంది. 


ఆ తరువాత  ఉమ్మడి  ఏపీ విడిపోవడం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఐటీ పరంగా పెద్దగా అడుగులు పడలేదన్నది వాస్తవం. విశాఖలో భాగస్వామ్య సదస్సులు ఎన్నో జరిగాయి. ఐటీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చెస్తున్నాయని చెప్పారు తప్ప అవి వచ్చిన దాఖలాలు అయితే లేవు. మరో వైపు ఐటీ పేరిట గత సర్కార్ భూములను దారదత్తం చేసే కార్యక్రమం చేపట్టిందన్న విమర్శలు వైసీపీ సర్కార్ చేస్తోంది.


ఇపుడు ఎటూ అధికారం చేతిలో ఉన్నదున్న ఐటీ రాజధానిగా విశాఖను తీర్చిదిద్దుతామని ప్రభుత్వం అంటోంది. ఈ మేరకు జగన్ తన మనసులోని మాటను శ్రీకాకుళం టూర్లో వెల్లడించారు. అక్కడ ట్రిపుల్ ఐటీ విధ్యార్ధులతో జగన్ ముఖాముఖీ మాట్లాడినపుడు ఐటీ గురించి ప్రస్తావన వచ్చింది. దానికి బదులిచ్చిన ముఖ్యమంత్రి ఐటీని విశాఖలో అభివ్రుధ్ధి చేస్తామని ప్రకటించారు. 


విశాఖను ఐటీ హబ్ గా  తమ ప్రభుత్వం తీర్చిదిద్దుతుందని, దేశమే కాదు, ప్రపంచం మొత్తం ఎదురుచూసే విధంగా ఐటీని విశాఖలో అభివ్రుధ్ధి చేస్తామని కూడా జగన్ హామీ ఇచ్చారు. దీంతో టీజీ చెబుతున్న నాలురు రాజధానుల్లో ఒక రాజధాని జగన్ మనసులో నుంచి బయటకు వచ్చిందని అంటున్నారు. ఓ విధంగా విశాఖ రెండవ రాజధాని అవుతుందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: