తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి మొదలవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ వ్యవహారాన్ని పక్కనపెడితే.. మరిన్ని అంశాలు హీటు పుట్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతిపక్షం ఎలాంటి ఆరోపణలు చేస్తుంది, అధికార పక్షం ఎలాంటి కౌంటర్లిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. 


తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మొదటి రోజు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడుతోంది. అర్ధిక శాఖ కూడా సీఎం వద్ద ఉండండతో.. కేసిఆర్ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. ఈ సమావేశాల్లో పలు అంశాలు అసెంబ్లీ హాట్ హాట్ గా చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో యూరియా సరఫరా సరిగ్గా లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కారణం అంటున్నాయి విపక్షాలు. దీనిని ఇప్పటికే ప్రభుత్వం తిప్పికోడుతోంది. అయినప్పుటికి విపక్షాలు ఈ అంశంపై అసెంబ్లీ చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది.


రాష్ట్రంలో జ్వరాల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని.. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో విపక్షాలు ఈ అంశంపై చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది. రోజురోజుకీ పెరెుగుతున్న డెంగ్యూ కేసులపై సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని వసతులున్నాయని ప్రభుత్వం చెబుతుంటే.. సిబ్బంది, మందులు లేరని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కొత్త సచివాలయ భవనం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. రాష్ట ప్రభుత్వ నిర్ణయంపై విపక్ష పార్టీల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. కొత్త సచివాలయ నిర్మాణం అంటే ప్రజా ధనం వృధా చేయడం అని కాంగ్రెస్ ,బిజేపి లు అంటున్నాయి. ఆ అలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. అసెంబ్లీ సెషన్ లో  ఈ అంశం కూడా దుమారం రేపే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు బిఏసీ సమావేశం ఉంటుంది. ఆ భేటీలో సభ ఎన్ని రోజుల నిర్వహించాలన్న అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: