ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వారు చేసిన ప్రయత్నాన్ని 'ఆదర్శప్రాయమైన కృషి' అని అభినందించారు.  ఈ సమయం లో  యావత్తు దేశం అంతా ఇస్రోతో నిలబడి ఉందని చెప్పారు. 'విక్రమ్ లాండర్'తో కమ్యూనికేషన్ దెబ్బతిన్న విషయాన్ని ఇస్రో ప్రకటించిన తరువాత, జగన్ మోహన్ రెడ్డి తన  ట్విట్టర్‌లో  ఇస్రో చేసిన కృషిని మరియు దాని  ప్రయత్నాలను ప్రశంసించారు.



"మనము దాదాపు విజయం సాధించాము, భారతదేశానికి ఈ శాస్త్రవేత్తలకు గర్వకారణం . చివరి నిమిషంలో ఒక చిన్న ఎదురుదెబ్బ కానీ ఇదే తరువాతి విజయానికి తొలి మెట్టు. దేశం మొత్తం ఈ సమయం లో ఇస్రో బృందంతో  నిలుస్తుంది,వారు  చేసిన ఆదర్శప్రాయమైన ప్రయత్నాలను అభినందిస్తుంది" అని చప్పట్లు కొదుతున్న ఎమోజీతో రెడ్డి ట్వీట్ చేశారు.




విక్రమ్ ల్యాండర్ శుక్రవారంశనివారం మధ్య రాత్రి తెల్లవారుజామున 1:30 నుండి 2:30 గంటల మధ్య చంద్రుని దక్షిణ దృవం వైపు దిగడానికి ప్రణాళిక చేయబడింది. తరువాత రోవర్ (ప్రగ్యాన్) రోల్-అవుట్ ఉదయం 5:30 నుండి 6:30 గంటల మధ్య ఉంది. చంద్రయాన్  దక్షిణ ధ్రువ ప్రాంతంలో సాఫ్ట్ ల్యాండింగ్ చేయడానికి  2 నిముషాల ముందు ఇస్రో చంద్రయాన్  విక్రమ్ ల్యాండర్తో కమ్యూనికేషన్ కోల్పోయింది. శనివారం తెల్లవారుజామున, ఇస్రో చైర్మన్ కె శివన్, చంద్రుని ఉపరితలం నుండి 2.1 కిలోమీటర్ల దూరంలో ల్యాండర్‌తో కమ్యూనికేషన్ కోల్పోయినట్లు ప్రకటించారు. 




విక్రమ్ ల్యాండర్ సెప్టెంబర్ 2 న చంద్రయాన్ -2 ఆర్బిటర్ నుండి విజయవంతంగా వేరు చేయబడింది. చంద్రయాన్ -2 ఆర్బిటర్ చంద్రుని ప్రస్తుత కక్ష్యలో  కొనసాగుతోంది. దాదాపు 23 రోజులు భూమి యొక్క కక్ష్య చుట్టూ తిరిగిన తరువాత, అంతరిక్ష నౌక ఆగస్టు 14 న చంద్రునిపై ప్రయాణాన్ని ప్రారంభించింది. జూలై 22 న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఈ మిషన్ బయలుదేరింది. చంద్రయాన్-1 లాంచింగ్ ముందు, సెప్టెంబర్ 2008 న  భారతదేశ ప్రభుత్వం రెండవ మిషన్ చంద్రయాన్-2 ను కేబినెట్ ఆమోదించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: