ఏపీలో ఇప్పుడు రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. 2019 ఎన్నికలు హోరా హోరీగా జరగతాయనుకుంటే ఆ ఎన్నికలో వార్ వన్ సైడ్ అయిపొయింది. వైసీపీకి ఎవరు పోటీ ఇవ్వలేకపోయారు. టీడీపీ 23 సీట్లకే పరిమితం అయితే .. జనసేన చావు తప్పి కన్ను లొట్టపడి ఒక సీటును మాత్రమే గెలిచింది. జగన్ అఖండ విజయంతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే టీడీపీ పార్టీ పరిస్థితి ఇప్పుడు అందరికీ తెలిసిందే. ఆ ఆపార్టీలోని నేతలు తమ భవిష్యత్ రాజకీయాల పట్ల తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు .. టీడీపీ ఘోర ఓటమి ఇవన్నీ చూసుకుంటే .. మళ్ళీ కూడా జగనే సీఎం అయ్యేటట్లు కనిపిస్తున్నారు. 


ఇప్పటికే టీడీపీ సీనియర్ నేతలు అందరూ ఓడిపోయి ఇళ్లకు పరిమితం అయిన పరిస్థితి. దీనితో టీడీపీలో గెలిచినా ఆ కొంత మంది కూడా తమ భవిష్యత్ పట్ల బెంగగా ఉన్నారని టాక్. గత దశాబ్దాలుగా ఏ సీఎం తీసుకోని నిర్ణయం ఆర్టీసీ విలీనం ..జగన్ తీసుకోవటంతో అందరూ జై జగన్ అంటూ మీడియ ముందు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదొక్క నిర్ణయం చాలు .. ప్రజల సమస్యల పట్ల జగన్ ఎంత చిత్త శుద్దితో పనిచేస్తున్నారని ! తన తండ్రి రాజన్న పాలనను గుర్తుకు తెస్తున్నారని .. రాజశేఖర్ రెడ్డి అడుగు జాడల్లో పరిపాలనను నడిపిస్తున్నారని. ఎవరు ఏది అడిగిన బోళా శంకరుడు మాదిరిగా హామీలు నెరవేర్చడం ఇవన్నీ జగన్ ప్రతిష్టను పది రెట్లు చేస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పాలి. 


దీనితో టీడీపీ ఎక్కడ లేని ఆందోళనకు గురౌతుంది. టీడీపీ తీసుకులోని నిర్ణయం కేవలం మూడు నెలల్లో జగన్ తీసుకొని ఇటు ప్రజల మనసును గెలుచుకున్నారు .. అటు టీడీపీని కుదేలు చేశాడు . అయితే జగన్  సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన రెండు నెలలు కాకముందే మొదటి అసీంబ్లీలో ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన పరిపాలన ఎలా ఉండబోతుందో మొదటి రెండు నెలల్లో అర్ధం అయ్యే విధంగా రాష్ట్ర ప్రజలకు చూపించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: