ముంబై మెట్రో మూడో దశ ప్రారంభించిన ప్రధాని మోదీ

 మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ముంబైలో మెట్రో రైల్ మూడో దశ ను ప్రారంభించారు పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన భోగిలతో ఈ మూడో దశ మెట్రో రైల్  ముంబైలో పరిగెత్తడం ఉంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ మెట్రో రైలు బోగీలు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడ్డాయి . కొలాబా- బాంద్రా ల మధ్య ఈ మూడో దశ  మెట్రో రైల్ ప్రారంభమయింది. ఈ మూడో దశ మొత్తం 33.5 కిలోమీటర్ల మేర ముంబై నగర మెట్రో ప్రయాణికులకు సేవలందిస్తుంది.



నిత్యం ట్రాఫిక్ రద్దీ తో సతమతమయ్యే ఆర్థిక రాజధాని ముంబైకి ఈ మెట్రో రైలు ఎంతగానో ఉపయోగపడుతుంది  అనడంలో సందేహం లేదు. వర్షాకాలంలో మరీ ఎక్కువ ట్రాఫిక్ సమస్యతో ముంబై నగర వాసులు ఎంతగానో ఇబ్బందులు పడతారు.   వారి కష్టాలను మెట్రో రైలు కొంతవరకు తీరుస్తుందని అనుకుంటున్నారు.



ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ  మాట్లాడుతూ చంద్రయాన్- 2 ప్రయోగం సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్త ల  కృషిని కొనియాడారు. చంద్రయాన్ టూ విజయవంతం చేయటానికి ఇస్రో శాస్త్రవేత్తలు పడిన కష్టం  చాలా ఎక్కువని, ఏ రకంగానైనా ఈ ప్రయోగాన్ని సఫలీకృతం చేయాలనే తపన అక్కడ శాస్త్రవేత్తలు అందరిలోనూ కనిపించిందని శ్రీ నరేంద్రమోడీ చెప్పారు.  మనుషులలో కొందరు ఏ పని చేయలేని వారు ఉంటారని, కొందరు పని కొంతవరకూ చేసి మధ్యలో తమ వల్ల కాదని విరమించుకుంటారని, ఇక మూడో వర్గం వారైతే ఎన్ని అవరోధాలు ఎదురైనా  అకుంఠిత దీక్షతో కార్య సాధన కొరకు నిర్విరామంగా కృషి చేస్తారని, ఈ ఇస్రో శాస్త్రవేత్తలు మూడో వర్గానికి చెందినవారని మోడీ ప్రశంసించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: