కేంద్రం ఇటీవలే పలు రాష్ట్రాలకు గవర్నర్ లను నియమించింది. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా బండారు దత్తాత్రేయను నియమించారు. మహారాష్ట్ర గవర్నర్ విద్యా సాగర్ రావు మాజీ అయ్యారు. ఐదేళ్ళపాటు గవర్నర్ గా ఉన్న ఆయన భవిష్యత్ ఏం చేయబోతున్నారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వస్తారా లేదా అనే దానిపై కరీంనగర్ రాజకీయాల్లో డిస్కషన్ నడుస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన విద్యాసాగరరావు మెట్ పల్లి ఎమ్మెల్యే గా కరీంనగర్ ఎంపీ గా పని చేశారు, కేంద్ర మంత్రిగా పని చేశారు


తెలంగాణలో పాగా వేయాలనుకుంటున్న బీజేపీ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం ప్రజల్లో ఇమేజ్ ఉన్న నాయకుడు కోసం వెతుకుతోంది. విద్యా సాగర్ రావుకు మంచి ఇమేజ్ ఉండటంతో ఆయన్ను మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. కోరుట్ల నియోజక వర్గం నుంచి విద్యా సాగర్ రావు పోటీ చేయాలని ఆయన అనుచరులు కోరుతున్నారు. అటు క్రియాశీల రాజకీయాల్లో ఉండేదుకు విద్యాసాగర రావు కూడా మొగ్గు చూపుతున్నారనేది సన్నిహితుల మాట.


అయితే ఆయన్నుంచి మాత్రం ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు . మరోవైపు విద్యాసాగరరావుకు డెబ్బై ఏడు ఏళ్ళు. బీజేపీ లో డెబ్బై ఐదు ఏళ్లు దాటిన వారికి ఎలాంటి పదవులు ఇవ్వడం లేదు . దీంతో విద్యా సాగర్ రావుపై అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది . సీనియర్ సేవల్ని ఉపయోగించుకుంటుందా లేక యాక్టివ్ పాలిటిక్స్ కు దూరం పెడుతుందా అనేది హాట్ టాపిక్ . అయితే తాజాగా గవర్నర్ బాధ్యతల నుంచి తప్పుకున్న విద్యా సాగర రావు రాజకీయ ప్రవేశంపై మరో నెల రోజులు ఆగితే క్లారిటీ వస్తుందని తెలుస్తోంది .

మరింత సమాచారం తెలుసుకోండి: