భారత దేశంలో అందరూ సమానులే.. కులం, మతం అనే విషం మనవరుకే ఉండాలి మన పిల్లల వరుకు వెళ్ళకూడదు అని ఇప్పుడు ఉన్న తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. కానీ అది కాదు కులం, మతం అనేవి ఇంకా కొనసాగాలి అన్నట్టు పిల్లల మనస్సులో కులం, మతం అనే విషాన్ని నింపుతుంది విధ్యావ్యవస్ధ. 


ఇప్పుడు ఈ విషయం ఎందుకు తేరా మెడకు వచ్చింది అని అనుకుంటున్నారా. విషయానికి వస్తే ఎక్కడైన సీబీఎస్ఈ ప్రశ్న పత్రం అంటే కష్టంగా ఉంటుంది. సబ్జెట్ ఉంటుంది అని అనుకుంటాం. కానీ ఈ ప్రశ్న పత్రంలో మాత్రం 50 ఏళ్ళ వెనక్కి వెళ్లి కులం, మతం ప్రశ్నలు వేసి పసి మనస్సులో విషాన్ని నింపుతుంది. 


సీబీఎస్ఈ సిలబస్ ఉన్న పాఠశాలలో నిర్వహించిన పరీక్షల్లో దళితులు, మైనారిటీల మనోభావాలు దెబ్బ తీసేలా వివాదాస్పందంగా ప్రశ్న పత్రాన్ని రూపొందించారు. ఈ విషయంపై విద్యావేత్తల నుంచి రాజకీయ నేతల వరుకు ప్రతి ఒక్కరు మండిపడుతున్నారు. తాజాగా తమిళ్ నాడు ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ ఈ ప్రశ్న పత్రంపై స్పందించారు. 


ఆ ప్రశ్న పత్రనికి సంబంధించిన ఫోటోని తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ  కేంద్ర మానవవనరుల శాఖను నిలదీశారు ఎంకే స్టాలిన్. అయితే ఆ ప్రశ్న పత్రల్లో వచ్చిన ప్రశ్నలు అన్ని కూడా మైనారిటీలు, దళితులు మనోభావాలు దెబ్బ తీసేలా ఉన్నాయి. దీంతో ఈ ప్రశ్న పత్రంపై విద్యావేత్తలు విరుచుకు పడుతున్నారు. 


విరుచుకు పడేంత ప్రశ్నలు ఏంటి అని అలొచ్చిస్తున్నారా ? ఈ ప్రశ్నలే అవి.. 


దళితులంటే ఎవరు..?  


ఎ) విదేశీయులు


బి) అంటరానివారు


సి) మధ్య తరగతివారు


డి) ఎగువ తరగతివారు అనే ఆప్షన్లు ఇచ్చారు. 


మరో ప్రశ్న ముస్లిమ్స్ కి సంబంధించి వచ్చింది. 


ముస్లింలకు సంబంధించిన ఈ క్రింది సాధారణ అంశమేది..? 


ఎ)ముస్లింలు బాలికలను పాఠశాలలకు పంపరు


బి)వారు శుద్ధ శాఖాహారులు


సి)వారు రోజా సమయంలో నిద్రపోరు


డి)పైవన్నీ


 అంటూ దళితులు, మైనారిటీల మనోభావాలు దెబ్బ తీసేలా ప్రశ్న పత్రాన్ని రూపొందించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: