దేశంలోనే సీనియర్ మోస్ట్ న్యాయవాది, అత్యంత ఖరీదైన న్యాయవాది అయిన రాంజఠ్మలానీ ఈ రోజు ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 96 సంవత్సరాలు.  అనారోగ్యంతో గత కొంతకాలంగా బాధపడుతున్న రాంజఠ్మలానీ ఢిల్లీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.  సింధ్ ప్రావిన్స్‌లోని సిఖర్పూర్‌లో  1923 సెప్టెంబర్ 14న జన్మించిన ఆయన మరో నాలుగేళ్ళు జీవించి ఉంటే శత పురుషుడు అయ్యేవారు.


కేంద్రంలో బీజేపీ హయాంలో మంత్రిగా కూడా పనిచేసిన జెఠ్మలానీ రెండుసార్లు రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. వివాదాస్పదమైన కేసులను వాదించడం ద్వారా ఆయన పేరు తెచ్చుకున్నారు. జెఠ్మలానీ కొరుకుడుపడని కేసులు ఎలా వాదిస్తారో ఆయన వైఖరి సైతం ఎవరికీ కొరుకుడు పడని విధంగానే ఉంటుందంటారు.


మంచి వాగ్ధాటి, సమయస్పూర్తి, డేరింగ్ అండ్ డేషింగ్ కలిగిన గ్రేట్ లాయర్ గా ఆయన్ని చెప్పుకోవాలి. ఆయన కేసు వాదిస్తున్నారని తెలిసే అవతల పక్షం వారికి లాయర్ కూడా దొరకరు అంటే  రాంజెఠ్మలానీ ఎటువంటి  న్యాయవాదో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అసలు పేరు రామ్ బూల్‌చంద్ జెఠ్మలానీ.  ఇదిలా ఉండగా దేశంలోని పేరు పొందిన ఎన్నో కేసుల్లో వాదించిన రాంజెఠ్మలానీ బీజేపీలో చేరి ఎవరికీ కొరుకుడుపడని ఉద్ధండపిండంగా  పేరు తెచ్చుకున్నారు.


వాజ్ పేయ్ మంత్రివర్గంలో ఆయన న్యాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఇక ఆయన వాదించిన కేసులు ఎన్నో ఉన్నాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అస్తుల కేసులను కూడా ఆయన వాదించారు.రాంజెఠ్మలానీ వంటి పేరు పొందిన న్యాయవాది భారత్ లో పుట్టడం అద్రుష్టంగా కూడా పేర్కొంటారు. ఆయన గొప్ప న్యాయవాది అని అంతా ఒప్పుకుంటారు. అయితే ఆయన ఎక్కువగా ఖరీదైన కేసులనే స్వీకరించడం వల్ల పేదలకు చేరువ కాలేకపోరని అంటారు. ఇదిలా ఉండగా దేశానికి న్యాయపరంగా విశేష సేవలు అందించిన రాంజెఠ్మలానీ మరణం తీరని లోటు అని ప్రముఖ‌ న్యాయవాదులు నివాళి  అర్పిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: