అసలు రాజధానిని మారుస్తున్నామని ఎక్కడ కూడా వైసీపీ చెప్పిన ధాఖలాలు లేవు. కానీ పవన్ అనే మేధావికి ఏమైందో తెలియదు గాని మీడియా ముందుకు వచ్చి జగన్ స్పదించాలి అంటూ పసలేని ఆరోపణలు చేస్తున్నారు. జగన్ విజయని ఈవీఎంల విజయంగా లెక్కేసిన పవన్ మేధావి .. ప్రజల తీర్పును అపహేళన చేస్తే ఎటువంటి పరిస్థితి ఎదురవుతుందో పవన్ మేధావి గారు తెలుసుకుంటే మంచిది. ప్రతి పక్షాలు ప్రతి దానికి రాద్ధాంతం చేసి ప్రజల్లో పరువును పోగుట్టుకుంటున్నారని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. రాజధాని విషయంలో టీడీపీ , జనసేన అతిగా స్పదించడంతో చివరికి భూమ్ రామ్ అయ్యే పరిస్థితి వస్తుంది. రాజధాని విషయంలో జగన్ స్పష్టత ఇవ్వాలని ప్రతి పక్షాలు చేస్తున్న తాజా వ్యాఖ్యలు.


ఎవడో పని బాట లేకుండా క్రియేట్ చేసిన రూమర్ ను పట్టుకుని జగన్ ను వివరణ ఇవ్వాలని ప్రతి పక్షాలు డిమాండ్ చేయడం ఇంత కంటే కామెడీ ఇంకొకటి ఉండదు. ప్రతిపక్షాలకు నిజంగా అంత చిత్త శుద్ధి ఉంటే .. ప్రజలు ఎదుర్కొంటున్న రియల్ సమస్యల మీద పోరాటం చేయాలి. అంతే గాని అర్ధం పర్థం లేని ఆరోపణలతో అధికార పార్టీ మీద విరుచుకుపడితే మొదటికే మోసం వస్తుంది.  అసలు వైసీపీ ప్రభుత్వం రాజధానిని మారుస్తున్నామని ఎక్కడ చెప్పలేదు. జగన్ కూడా ఇప్పటి వరకు చెప్పింది లేదు.


అయితే జగన్ విదేశాల్లో ఉన్నప్పుడు బొత్స వ్యాఖ్యలను పట్టుకొని ప్రతి పక్ష పార్టీలు నానా హంగామా చేసినాయి. ఇందులో ఒకటి మాత్రం సుస్పష్టం. ఎలాగైనా జగన్ ప్రభుత్వం మీదకు ప్రజలను రెచ్చగొట్టాలని .. అయితే వైసీపీ నాయకులు ఎంత మంది చెప్పిన ప్రతి పక్ష పార్టీలు వినేటట్లు కనిపించడం లేదు. జగనే స్వయంగా రాజధాని విషయంలో నోరు తెరిసి చెబితే గాని ప్రతి పక్ష పార్టీలు కామ్ అయ్యేటట్లు కనిపించడం లేదు. ముఖ్యంగా మీడియా డిబేట్ లలో కూర్చొని పెద్ద మేధావులుగా మాట్లాడే వాళ్ళ నోర్లు మూగబోయేటట్లు లేవు. ప్రతి విషయంలో ఇలా జగన్ స్పందిస్తూ .. పోతే జగన్ వివరణ ఇచ్చుకుంటూ పోతూ ఉండాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: