జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీలోకి వస్తే కొందరి అడ్రస్ గల్లంతు కాక తప్పదు. ఆ విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. అయితే టీడీపీలో ఒక వర్గం ఎన్టీఆర్ రాకుండా తీవ్రంగా అడ్డుకుంటుంది. ఎక్కడ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే పార్టీని ... కార్యకర్తలను తన చేతిలోకి తీసుకుంటాడని భయపడుతున్నారు. 2019 ఎన్నికలో టీడీపీ పార్టీ కనీ విని ఎరుగని రీతిలో ఓటమి పాలైంది. ఎన్నికల కౌంటింగ్ ఒక్క రోజు ముందు కూడా చంద్రబాబు నూటికి వెయ్యి శాతం గెలుస్తామని చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు తీరా ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ఖంగు తిన్నాడు. పలు సభల్లో కూడా ఇంత ఘోర ఓటమి రావటానికి నేనేమి తప్పు చేశానని చెప్పిన సంగతీ కూడా తెలిసిందే.


ఒకే ఒక ఎన్నికలు టీడీపీ పార్టీని మట్టి కరిపించాయంటే అతిశయెక్తి కాదు. ఆపార్టీ పరిస్థితి గత 30 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా ఘోరంగా క్షేత్ర స్థాయిలో కూడా దెబ్బతినిందంటే అతిశయెక్తి కాదని చెప్పాలి. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత అధినేత చంద్రబాబుతో పాటు ఆపార్టీ కార్యకర్తలు కూడా పెద్ద షాక్ కు గురయ్యారు.  అయితే టీడీపీ ఓటమి .. ఆ పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ రావాల్సిందేనని డిమాండ్ రోజురోజుకు పెరుగుతూ వస్తుంది. పార్టీలోని కొంత మంది నేతలు భహిరంగానే చర్చించుకుంటున్నారు. ఎన్టీఆర్ వస్తేనే పార్టీ బాగుపడుతుందని చాలా మంది ఆశిస్తున్నారు. 


అయితే జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ పై పార్టీలో ఒక వర్గానికి ఇష్టం లేదన్న సంగతీ తెలుస్తుంది. మొన్న బాలయ్య చిన్న అల్లుడు భరత్ వ్యాఖ్యలను చూస్తే అర్ధం అవుతుంది. ఎన్టీఆర్ పై వీరికి ఎంత ఈర్ష్య ఉందో .. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ పార్టీ ఎంట్రీ మీద లోకేష్ స్పందించిన సంగతీ తెలిసిందే . లోకేష్ చెబుతూ పార్టీలోకి ఎవరైనా రావొచ్చని .. ఎన్టీఆర్ కూడా రావొచ్చని ప్రత్యేకంగా వ్యక్తుల కోసం పార్టీ ఉండదని లోకేష్ సెలవిచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: