పవన్ కళ్యాణ్ రాజకీయం ఇప్పటికి కూడా సీరియస్ గా సాగడం లేదని చెప్పాలి. సభలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడటం .. లేదా ప్రతి పక్షాన్ని తనదైన శైలిలో సినిమా భాషల్లో తిట్టడం వరకే అతని రాజకీయం పరిమితం అవుతుంది. కొన్ని సార్లు ఈ విమర్శలు శృతి మించి నవ్వులుపాలవుతున్నారు కూడా. పవన్ కు ఉన్న ఛరిస్మాతో బలమైన ప్రతిపక్షంగా ఎదగొచ్చు. కానీ పవన్ ను గైడ్ చేసే నాయకులను తన పక్కన పెట్టుకోవటం లేదు. జనసేనలో మేధావిగా ముద్రపడిన జేడీ లక్ష్మీ నారాయణ కనిపించడం లేదు. బలమైన కార్యాచరణతో .. ప్రజా పోరాటాలతో ప్రజలతో మమేకం అయితే పవన్ ను ప్రజలు గుర్తిస్తారు. కానీ పవన్ ను ఆ దిశగా ఎందుకో ఆలోచించడం లేదు. 


సభలో నాలుగు మాటలు మాట్లాడి వెళ్ళిపోవటం వరకే పవన్ రాజకీయం పరిమితం అవుతుంది. ఏ ఒక్క ప్రాబ్లెమ్ మీద గట్టిగా పోరాటాలు చేసిన దాఖలాలు లేవు. పవన్ ఇక నుంచైనా తాను చేస్తున్న తప్పులను తెలుసుకోవటం మంచిది. జనసేన .. ఎన్నికల్లో ఘోర ఓటమిని చవి చూసింది. చివరికి అధినేత కూడా రెండు చోట్ల ఓడిపోవటంతో ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఘోరంగా తయారైంది. ఇన్ని రోజులు ఆ పార్టీని నమ్ముకున్న వాళ్లు ఇంకా ఆ పార్టీని నమ్ముకుని కష్టపడే పరిస్థితిలో ఎవరు లేరని చెప్పాలి.


జనసేన దాదాపు అన్ని స్థానాల్లో .. ఏదో కొన్ని స్థానాలు తప్పిస్తే .. డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితి. ఇప్పటికే 30 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీ పార్టీ కూడా నామ రూపాలు లేకుండా పోయిన పరిస్థితి. అలాంటిది ఇక జనసేన గురించి ఏం చెప్పగలం. ఎన్నో అంచనాల నడుమున ఎన్నికల్లో దిగిన జనసేన కేవలం ఒకే ఒక్క సీటుకు మాత్రమే పరిమితం అయ్యింది. పార్టీ  అధినేత పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవటం ఇంకా ఘోరమైన విషయం. అయితే ఎన్నికల్లో జనసేన ఓడిపోవడానికి కారణం అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ కనీసం ఎన్నికల మూడేళ్ళ నుంచైనా ఆ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయలేకపోయారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: