పిపిఏల రద్దుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డిపై  కేంద్రమంత్రి ఆర్కె సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రప్రభుత్వం వద్దని చెబుతున్నా పిపిఏల రద్దు విషయంలో జగన్ వెనక్కు తగ్గటం లేదని చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.  చంద్రబాబు హయాంలో పిపిఏలపై అవకతవకలు జరిగాయంటూ లేఖలతో జగన్ తమను కలసినట్లు కేంద్రమంత్రి చెప్పటం ఆశ్చర్యంగా ఉంది.

 

అవకతవకలు జరిగినట్లు ఎటువంటి ఆధారాలు లేకుండానే జరిగాయని చెప్పటంలో అర్ధం లేదన్నారు. జగన్ వైఖరి వల్ల పెట్టుబడుల విషయంలో తీవ్ర ప్రభావం చూపుతుందని తాము చెప్పినా జగన్ వినటం లేదన్నారు. పైగా పవన్ ప్రాజెక్టులపై జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు కేంద్రమంత్రి కామెంట్ చేయటమే విచిత్రంగా ఉంది.

 

నిజానికి జగన్ కేంద్రమంత్రులను కలిసి మాట్లాడిన మాటలను సదరు మంత్రులు బయటకు చెప్పటమన్నది తప్పే. మరి ఆర్కె సింగ్ ను జగన్ ఎప్పుడు కలిశారో తెలీదు. పిపిఏల్లో అవినీతి జరిగినట్లు జగన్ అసెంబ్లీ సమావేశాల్లోనే స్పష్టంగా ప్రకటించారు. ఇదే విషయమై జగన్ నియమించిన నిపుణుల కమిటి కూడా పిపిఏల్లో సుమారు 2500 కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్లు తేల్చింది. అయితే కేంద్రమంత్రి మాత్రం ఎక్కడా అవినీతి జరగలేదని చంద్రబాబుకు సర్టిఫికేట్ ఇచ్చేయటమే ఆశ్చర్యంగా ఉంది.

 

ఇక్కడే ఓ విషయంలో అనుమానాలు బయలుదేరాయి. బిజెపిలో ఓ సెక్షన్ నేతలేమో చంద్రబాబు హయాంలో భారీ అవినీతి జరిగినట్లు మండిపడుతున్నారు. పోలవరం, పిపిఏలు, రాజధాని నిర్మాణం లాంటి ప్రాజెక్టుల్లో భారీ అవినీతి జరిగిందని విరుచుకుపడుతున్నారు. అదే సమయంలో చంద్రబాబుకు క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు కేంద్రంలోని కొందరు నేతలు పోటి పడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్న నేతకు క్లీన్ సర్టిఫికేట్ ఇవ్వటంలో కేంద్రమంత్రులు ఎందుకు పోటి పడుతున్నారో అర్ధం కావటం లేదు. చూడబోతే ఫిరాయింపు ఎంపిలు చంద్రబాబుకు అనుకూలంగా బాగానే వర్కవుట్ చేస్తున్నట్లుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: