యాదాద్రిలో స్వామి ఆలయం అత్యద్భుతంగా పునర్నిర్మాణం జరుగుతోంది. ఈ తరుణంలోనే సీఎం కేసీఆర్ మరియు ఇతర రాజకీయ నాయకుల శిల్పాలు చెక్కడం కొంత వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో గత రెండు మూడు రోజు నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగింది. దినితో యాదాద్రిలో రాజకీయ నేతల శిల్పాలను అధికారుల ఆదేశాల మేరకు అక్కడ తొలగింపు పూర్తీ అయింది. కేవలం రాజకీయ అంశాలే కాకుండా వివాదస్పదమైన ప్రతి విగ్రహాన్ని తొలిగించినట్లు అక్కడి అధికారులు తెలియ చేసారు.  తొలగించిన శిల్పాల స్థానంలో ఆగమశాస్త్రం ప్రకారం నిర్మాణాలు చేపడున్నారు.



భగవంతుడు సంబంధించినవి మరియు సాంప్రదాయ శిల్పాలని తొలగించిన వాటి స్థానంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది అని ఆలయ అధికారి  తెలియజేసారు. అత్యద్భుతమైన శిల్పాలు, హంసలు మరియు అందమైన పుష్పాలను తొలిగించన స్థానంలో పెడుతున్నట్లు కూడా తెలియచేసారు.  గాంధీ, నెహ్రు, ఇందిరా గాంధీ, కేసీఆర్ మరియు కారు గుర్తు వంటివి ప్రధానంగా తొలగించడం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.  ఈ శిల్పాలను తొలగించడానికి ప్రధాన కారణం ఇవి రాజకీయ అంశంగా మారడం వలనే అధికారులు ఈ చర్యలు తీసుకోవడం జరిగింది.



ఆలయ శిల్పాలను చెక్కేటప్పుడు తాము కొని శిల్పాల గురించే ప్రస్తావించినట్టు మరియు మిగితా రాజకీయ నాయకుల శిల్పాలను ఆ శిల్పి తన అభిమానంతో చెక్కినట్లు తెలుస్తుంది. ఇవి ప్రధానంగా అభిమానంతో మరియు భవిషత్ తరాల వారికీ ఉపయోగ పడుతుంది అనే ఉద్దేశంతో రాజకీయ నాయకుల శిల్పాలను ఏర్పాటు చేయడం జరిగింది.   కానీ ఇవి రాజకీయ వివాదంగా మారడంతో వాటిని తొలగించడం జరిగింది అని తెలియచేసారు.ఇక్కడకు సీఎం కెసిఆర్ కూడా లక్ష్మి నారాయణ దర్శనానికి వస్తుంటారు.



ఇటువంటి తరుణంలో ఇలా జరగడం చాల చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా ఇవి ఆలయానికి సంబంచిన పనులు కొంత నెమ్మదించడంతో అక్కడికి వచ్చిన భక్తులు ఇవి చూసి కొంత ఆగ్రహంతో ఈ వివాదాన్ని చేసినట్లు తెలుస్తుంది.  హిందువుల మనోభావాలు ఎట్టి పరిస్థితుల్లో దెబ్బతినకుండా జాగ్రత్త పడుతున్నట్లు మరియు రాజకీయ అంశాలు ఇందులోకి రాకుండా జాగ్రత్త పడి శాస్త్ర ప్రకారం నడుచుకుంటున్నట్లు తెలియచేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: