టీఆర్ఎస్ నాయకులందరూ  ఎదురు చూస్తున్న అత్యుత్తమ ఘట్టం ఆదివారం నాడు ముగుసింది. రాష్ట్ర ప్రజలు కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన తెలంగాణ క్యాబినెట్ విస్తరణ ముగిసింది. ఎటువంటి సంచలనాలకూ అవకతవకలకు తావు లేకుండా తనకున్న రాజకీయ చాణుక్యతకు ఉపయోగించి కేసీఆర్ పకడ్బందీగా మ్యటర్ సెటిల్ చేశారు. పాతవారికి ఉద్వాసన చెప్పకుండా వారిని ఉంచుతూ మొత్తం ఆరుగురికి అవకాశం కల్పించారు. 


ఈ సారి కూడా తన కొడుకు కేటీఆర్ మేనల్లుడు హరీశ్ రావుకు మంత్రి వర్గం లో చోటిచ్చారు. కేటీఆర్ కు గతంలో నిర్వహించిన మున్సిపల్ అర్బన్ డెవలప్ మెంట్ ఐటి పరిశ్రమల శాఖల్నే తిరిగి అప్పగించారు. హరీశ్ రావు గతంలో భారీ నీటి పారుదల శాఖలను నిర్వహించగా ప్రస్తుతం ఆయనకు కీలకమైన ఆర్థిక శాఖను ఇచ్చారు.

కొడుకు మేనల్లుడి కి క్యాబినెట్ బెర్తు లు ఇచ్చిన కేసీఆర్ మరి కుమార్తె కు ఎలాంటి అవకాశమిస్తారనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది పార్లమెంట్ ఎన్నికల్లో ఆమె ఓటమిపాలయిన విషయం తెలిసిందే. రాజకీయం గా మంచి పట్టు తెలివితేటలున్న కవిత రైతుల పోరాటం ముందు తలొగ్గాల్సి వచ్చింది. కానీ తెలంగాణ జాగృతి నేతగా పార్లమెంటు సభ్యురాలి గా ఆమె సమర్థవంతమైన పాత్రను పోషించారు. అయితే కొడుకు అల్లుడి ని ఎటువంటి ఇబ్బంది లేకుండా మంత్రివర్గం లోకి తీసుకున్న సీఎం కేసీఆర్, కూతురు కవిత కు ఏ విధంగా న్యాయం చేస్తారో అని ఆసక్తి జనాల్లో నెలకొనుంది.

కొంత కాలం క్రితం ఆమెకు రైతు సమన్వయ సమితి అధ్యక్షురాలి గా చేస్తారనే రూమర్స్ వచ్చాయి. మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా తో ఖాళీ అయిన హుజూర్ నగర్ అసెంబ్లీ నుంచి కవితను పోటీ చేయిస్తారనే ప్రచారం కూడా జరిగింది. అయితే తాను ఓడిపోయిన నిజామాబాద్ లోనే ఉంటానని ఎక్కడికీ వెళ్లబోనని కవిత స్పష్టం చేశారు ఇప్పుడు కేటీఆర్ మినిస్టర్ అయ్యారు కనుక ఆయన ఇప్పటి వరకు చేపట్టిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు ను కవితకు ఇస్తారని ప్రచారం జోరుగా జరుగుతోంది.తరువాత రాజ్య సభకు పంపే అవకాశం కూడా లేకపోలేదు మరి కేసీఆర్ మదిలో ఆలోచన ఉందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: