కేంద్ర ప్రభుత్వం ట్రాఫిక్ ఫైన్స్ పెంచినప్పటినుంచి దేశంలో ఎక్కడ చూసినా వాటి గురించే చర్చ. నూతన మోటార్ చట్టం కింద ఆటోడ్రైవర్ కి అంత ఫైన్ వేశారు…లారీ డ్రైవర్ దగ్గర అన్ని వేలు తీసుకున్నారు…ఒకతని స్కూటీ ధర కన్నా అతను కట్టిన ఫైన్ డబ్బులు ఎక్కువ అని రోజూ చూస్తూనే ఉన్నాం. ఈ జరిమానాల తాకిడి భరించలేక వాహనదారులంతా చచ్చినట్లు పత్రాలు సమకూర్చుకునే పనిలో పడ్డారు. సరే పత్రాలు ఉంటే సరిపోతుంది అనుకుందాం కానీ మన పొరపాటో లేక ఏమరుపాటో.. వాటిని మర్చిపోతే..? సార్ ఇంటిదగ్గర మర్చిపోయాను సార్ అంటే పోలీసోడు వదులుతాడా? ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేస్తాడు..!

అలాంటి వారి కోసమే డిజిటల్ ఇండియా లో భాగంగా ప్రజలు తమ ముఖ్యమైన పత్రాలను ఆన్లైన్లో భద్రపరిచి చేసుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం డిజి లాకర్ అనే యాప్ ను తీసుకు వచ్చింది. ఇది గత ఏడాదే వచ్చిన ఇప్పుడు ప్రజలకు మరింత ఉపయోగపడుతుంది.

డిజి లాకర్ (Digi Locker)
ఇందులో మీ డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ ఇంకా ఇతర పాత్రలను కూడా భద్రపరుచుకోవచ్చు. ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ లో నుండి ఈ యాప్ ను మన ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని మొబైల్ నెంబర్ మరియు ఓటీపి తో లాగిన్ అవ్వాలి. అక్కడ ఫైల్స్ అప్లోడ్ చేసుకోండి అన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మనం ఫైల్స్ అన్నీ అప్లోడ్ చేస్తే సరి… భారీ జరిమానల నుండి ఫోన్ చూపించి సులభంగా తప్పించుకోవచ్చు.

ఎమ్-పరివాహన్ (m parivaahan)
ఇదే తరహాలో కేంద్రం మరొక యాప్ ను కూడా ప్రవేశపెట్టింది. ఇందులో వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ వివరాలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ వివరాలను పొందుపరచుకోవచ్చు. డిజీ లాక్ లాగే డౌన్లోడ్ చేసుకొని కాంటాక్ట్ నెంబర్ తో యాప్ లో కి లాగిన్ అయితే చాలు. 

ఆర్.టీ.ఏ ఎమ్ వాలెట్ (RTA m wallet)
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో జస్ట్ మీ వాహన నెంబరు నమోదు చేస్తే అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ స్మార్ట్ కార్డులతో సహా మీ ముందు ప్రత్యక్షమవుతాయి. 

ఇకపోతే కొత్తగా అమల్లోకి వచ్చిన మోటార్ చట్టం ప్రకారం పైన చెప్పిన యాప్స్ లో నిక్షిప్తమై ఉన్న ధ్రువ పత్రాలు చూపిస్తే వాహనదారులకు ఎలాంటి జరిమానాలు విధించబోమని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. 1989 కేంద్ర మోటార్ వాహనాల చట్టం లోని సవరించిన ప్రొవిజనల్ కింద వీటిని అనుమతిస్తున్నారట. ఆర్టిఏ ఎం వాలెట్ మాత్రం తెలంగాణాలో మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఇంకేం మరి ఫోన్ జేబులో పెట్టుకొని బండిలో రయ్యిమని దూసుకెళ్లిపోండి.


మరింత సమాచారం తెలుసుకోండి: