తెలుగుదేశంపార్టీ తరపున పెయిడ్ ఆర్టిస్టుల గోల ఎక్కువైపోతోంది. అసలు నేతలు చంద్రబాబునాయుడు ఆదేశాలను పెద్దగా పట్టించుకోకపోవటంతో పెయిడ్ ఆర్టిస్టులే తెర మీద కనబడుతున్నారా ? అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాజాగా టిడిపి గుంటూరులో నిర్వహిస్తున్న వైసిపి బాధితుల శిబిరంలో కూడా పెయిడ్ ఆర్టిస్టులున్నారని స్వయంగా హో శాఖ మంత్రి మేకతోటి సుచరిత ఆరోపించిన విషయం అందరికీ తెలిసిందే.

 

శిబిరంలో పెయిడ్ ఆర్టిస్టులున్నారని హోం శాఖ మంత్రి ప్రకటించారంటే అందులో ఎంతో కొంత నిజముండే ఉంటుంది. పెయిడ్ ఆర్టిస్టుల విషయంలో సమాచారం ఏమీ లేకుండా సుచరిత మాట్లాడరు కదా ?  శిబిరంలో బాధితుల రూపంలో ఉన్న వారంతా నిజమైన బాధితులేనా ? లేకపోతే పెయిడ్ ఆర్టిస్టులా ? అన్న విషయాన్ని తామే తేల్చేస్తామని సుచరిత ప్రకటించారు కూడా.

 

ఎప్పుడైతే బాధితులతో శిబిరమంటూ చంద్రబాబు గోల మొదలుపెట్టారో అప్పుడే ప్రభుత్వం అలర్టయ్యుండాల్సింది. శిబిరంలో ఉన్న వారు నిజంగా బాధితులైతే వారికి రక్షణ కల్పంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అదే సమయంలో శిబిరంలో పెయిడ్ ఆర్టిస్టులు  ఉండుంటే వారి బండారాన్ని బయటపెట్టాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే.

 

చంద్రబాబు, లోకేష్, టిడిపి నేతలు చేస్తున్న ప్రతీ ఆరోపణను జాగ్రత్తగా గమనించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఎందుకంటే గతంలో రెండుసార్లు వేర్వేరు సంఘటనల్లో పెయిడ్ ఆర్టిస్టులతో చేసిన గగ్గోలు బయటపడిన విషయం తెలిసిందే. వరదల సమయంలోను, తిరుమలలో చర్చి నిర్మాణం పేరుతోను కొందరు పెయిడ్ ఆర్టిస్టులతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బురద చల్లేందుకు టిడిపి ప్రయత్నించింది.

 

టిడిపి చేసిన ప్రయత్నాలన్నీ ఆధారాలతో సహా బయటపడింది. అయితే ఆ విషయాలగురించి మాత్రం తండ్రి, కొడుకులు నోరు విప్పటం లేదు. అందుకనే టిడిపి చేసే ప్రతి రచ్చ వెనుక పెయిడ్ ఆర్టిస్టుల పాత్రను విస్మరించేందుకు లేదు. బహుశా ఆ విషయాన్ని గుర్తుంచుకునే సుచరిత పెయిట్ ఆర్టిస్టులున్నారని ఆరోపించుంటారు.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: