Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Oct 18, 2019 | Last Updated 2:17 pm IST

Menu &Sections

Search

అరే చంద్రబాబుకు ఇష్టమైన నేత అజ్ఞాతంలోకి పోయాడే !

అరే చంద్రబాబుకు ఇష్టమైన నేత అజ్ఞాతంలోకి పోయాడే !
అరే చంద్రబాబుకు ఇష్టమైన నేత అజ్ఞాతంలోకి పోయాడే !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అధికారం ఉన్నప్పుడు నేతలు విర్రవీగడం అధికారం కోల్పోయిన వెంటనే సైలెంట్ అయిపోవటం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అయితే టీడీపీ ఫైర్ బ్రాండ్ సోమిరెడ్డి ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లి నట్టు తెలుస్తుంది. నెల్లూరులో ఆరు సార్లు పోటీ చేసి ఓడిపోయిన ఘనుడు సోమిరెడ్డి. అయినా చంద్రబాబుకు ఈయన అంటే చాలా మమకారం. ఓడిపోయినా సరే పిలిచి మంత్రి పదవి ఇచ్చారు. సోమిరెడ్డి మీద ఒక భూదందా విషయంలో కేసు ఫైల్ అయినట్టు తెలుస్తుంది. దీనితో సోమిరెడ్డి అజ్ఞాతంలోకి పోయినట్టు తెలుస్తుంది. ఇతనే కాదు ఇప్పుడు చాలా మంది టీడీపీ కీలక నేతలు బయట ఆచూకీ కనిపించడం లేదు. 

అయితే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ పార్టీ నుంచి నేతలను కొనుగోలు చేసి విచ్చల విడిగా రాజకీయ వ్యభిచారం చేశారు. వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ముఖ్యంగా ఆది నారాయణ రెడ్డి పేరు చెప్పుకోవచ్చు. ఇప్పుడేమో ఆది అసలు ఎక్కడ కనిపించడం లేదు. చంద్రబాబు ఇచ్చిన మంత్రి పదవి కోసం వచ్చారు. ఇప్పుడు అధికారం పోయేసరికి బాబును వదిలేశారు. అలాగే ఎన్నికలో పోటీ చేయకపోయిన నెల్లూరు నారాయణకు మంత్రి పదవి ఇచ్చి అందలం ఎక్కించారు.


కానీ నారాయణ ఇప్పుడేమో వైసీపీ మీద అసలు విమర్శలు చేయడం లేదు. ఇంకా చెప్పాలంటే వైసీపీ ఓకె అంటే దూకేందుకు సిద్ధంగా ఉన్నారు. నెల్లూరు నారాయణ .. టీడీపీ పార్టీకి ఆర్ధికంగా వెన్ను దన్నుగా నిలబడి పార్టీకి ఎన్నికల్లో డబ్బు కొరత లేకుండా చూశారు. అయితే రాజధాని ప్రాంతంలో నారాయణకు సుమారు 2000 ఎకరాల భూమి బినామీ పేర్ల మీద  ఉన్నట్టు వైసీపీ ఆరోపిస్తుంది. ఇప్పుడు ఆ దిశగా సాక్ష్యాలను సేకరించే పనిలో ఉంది. నెక్స్ట్ టార్గెట్ నారాయణతో కలిపి మొత్తం ఐదుగురు టీడీపీ నేతలు కేసుల్లో బుక్ అవుతారని చెప్పాలి.

chandrababuku istamaina neta ajnathamloki poyade
5/ 5 - (1 votes)
Add To Favourite