ఆంధ్ర ప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తుంటే అది చూసి తట్టుకోలేకా చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యేలు. ఛలో ఆత్మకూరు కార్యక్రమం చంద్రబాబు ఇంతలో ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి మోపిదేవి, ఎంపి లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, గోపిరెడ్డి, బల్లా ఇతర నాయకులు కలిసి మంగళవారం గుంటూరు మీడియా సమావేశంలో మాట్లాడారు.                                      


అయితే చంద్రబాబు 'ఛలో ఆత్మకూరు కార్యక్రమం'పై ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందిస్తూ ''పల్నాడులో టిడిపి నాయకులపై వైసిపి దాడులు చేస్తుందంటూ తెలుగు దేశం పార్టీ ఆరోపణలు చేస్తుందని, వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పల్నాడులో మరింత ప్రశాంతత చేకూరిందని చెప్పారు. యరపతినేని, కోడెల, పుల్లారావు, జీవీ ఆంజనేయులు చాలా అరాచకాలు చేశారని ఆరోపించారు.                                                      


ఓడిన చంద్రబాబు 'ఛలో ఆత్మకూరు'కు శ్రీకారం చుట్టి గూండాలాగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మాచర్ల, దుర్గి, నరసరావుపేట ప్రాంతాల్లోని టిడిపి భాధితులతో కలిసి వైసీపీ వారు కలిసి 'చలో ఆత్మకూరు' కార్యక్రమాన్ని చేపడుతున్నామని, బాధితులకు సమాధానం చెప్పేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే అంబటి రాంబాబు సవాల్‌ విసిరారు. మరి వైసీపీ 'ఛలో ఆత్మకూరు' ప్రోగ్రాంతో టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.                        



మరింత సమాచారం తెలుసుకోండి: