చంద్రబాబునాయుడు నిరాహార దీక్షకు దిగుతున్నారు. టిడిపి నేతల హౌస్ అరెస్టుకు నిరసనగా ప్రభుత్వ, పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా తన ఇంటి దగ్గరే రాత్రి వరకూ నిరాహార దీక్షకు కూర్చోవాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. చాలా చిన్న విషయాన్ని చంద్రబాబు ఎంత పెద్దగా చేయగలరో అన్నదానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ.  ఏమి చేసినా తనను తాను బ్రహ్మాండంగా ప్రొజెక్టు చేసుకోవటమే చంద్రబాబుకు కావాల్సింది. ఇక్కడ కూడా అలాగే వర్కవుట్ చేసి విజయం సాధించారు.

 

నిజానికి రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగలేదన్నది వాస్తవం. కానీ మూడు నెలల క్రితమే అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అన్నీ రంగాల్లోను ఫెయిల్ అయ్యారని లోకానికి చాటడమే చంద్రబాబు ప్లాన్.  అందుకు మొదటిసారి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల నుండి ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు, ఫెయిలవుతునే ఉన్నారు. దాంతో ఇక లాభం లేదనుకుని శాంతి భద్రతల అంశాన్ని ఆయుధంగా మార్చుకోవాలని అనుకున్నారు.

 

అప్పటికే కొన్ని గ్రామాల్లో రెండు పార్టీల మధ్య చెదురుమదురు సంఘటనలు జరుగుతున్నాయి. దాన్నే అడ్వాంటేజ్ గా తీసుకోవాలని చంద్రబాబు ప్లాన్ వేశారు. దానికి తమ వంతుగా ఎల్లోమీడియా శక్తివంచన లేకుండా ఆజ్యం పోస్తోంది. దానికితోడు ప్రభుత్వం నిర్లక్ష్యం వహించటం కూడా చంద్రబాబుకు బాగా కలసివచ్చింది.

 

అందుకనే బుధవారం చలో ఆత్మకూరు కార్యక్రమం పెట్టుకున్నారు. తాను కార్యక్రమం పెట్టుకుంటే పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తారని చంద్రబాబుకు బాగా తెలుసు. పోలీసులు అరెస్టులు చేసేటపుడు బాగా రచ్చ జరుగేట్లుగా ప్లాన్ చేశారు. నేతల హౌస్ అరెస్టుకే ఇంత రచ్చ అయితే ఇక చంద్రబాబు అరెస్టు చేసేటపుడు పరిస్ధితులు ఇంకెలాగుంటాయి ?

 

ఇక్కడే  చంద్రబాబు ప్లాన్ వర్కవుటవుతోంది.  చంద్రబాబు హౌస్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. కరకట్ట మీదున్న ఇంట్లో నుండి బయటకు రాగానే అరెస్టు చేయటానికి పోలీసులు మోహరించున్నారు. చంద్రబాబు బయటకు రాకా తప్పదు, అరెస్టు అవ్వకా తప్పదు. అందుకనే ప్రభుత్వ చర్యలకు నిరసనగా రాత్రి వరకూ నిరాహార దీక్ష అంటూ మొదలుపెట్టారు.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: