Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Sep 18, 2019 | Last Updated 12:26 pm IST

Menu &Sections

Search

అంతర్జాతీయ వేదికగా ‘పాక్’కు షాకిచ్చిన ‘భారత్’

అంతర్జాతీయ వేదికగా ‘పాక్’కు షాకిచ్చిన ‘భారత్’
అంతర్జాతీయ వేదికగా ‘పాక్’కు షాకిచ్చిన ‘భారత్’
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

భారత్ – పాకిస్తాన్ ఈ రెండు దేశాల మధ్యం పచ్చగట్టి వేస్తేనే భగ్గుమంటోంది. పాక్ భారత్ ఎన్నిసార్లు బుద్ది చెప్పినా కుక్కతోక వంకరా అన్నట్లు తీరు మారడం లేదు. ఇతర దేశాలు కూడా చురకలంటించినా మార్పు రావడం లేదు. జమ్మూ అండ్ కశ్మీర్‌ అంశంపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి సదస్సులో పాక్‌ చేసిన ఆరోపణలకు భారత్‌ దీటుగా సమాధానం ఇచ్చింది. ఐక్యరాజ్య సమితిలో కూడా భారత్ తన గోడు వెళ్లబోసుకుంది. అయితే ఐక్యరాజ్య సమితి లో పాకిస్తాన్ కు భారత ధీటుగా సమాధానం చెప్పింది. జమ్మూకశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ భారత్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పాక్ తీరును భారత్ ఎండగట్టింది. జమ్మూకశ్మీర్ పై పాక్ విష ప్రచారాన్ని ఖండించిన భారత్, తన అంతర్గత విషయాల్లో మరో దేశం జోక్యాన్ని సహించబోమని స్పష్టం చేసింది. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా, అమలు చేసినా అవి పూర్తిగా భారతీయ చట్టాలు, ప్రజాస్వామ్య సంప్రదాయాలకు అనుగుణంగా ఉంటాయని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో భారత్ తేల్చిచెప్పింది. ఈ సమావేశంలో భారత్ తరఫున విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విజయ్ సింగ్ ఠాకూర్ ప్రసంగించారు.

 

పార్లమెంటులో పూర్తిస్థాయి చర్చ అనంతరమే కశ్మీర్ విషయంలో మేం నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు. దీనికి విస్తృత స్థాయిలో మద్దతు కూడా లభిస్తోందని చెప్పారు. ఈ సర్వసత్తాక నిర్ణయం పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమేనని, మానవ హక్కుల పేరుతో ఇలాంటి వేదికలపై రాజకీయ విష ప్రచారం చేయడాన్ని తాము ఖండిస్తున్నామని చెప్పారు. ఇతర దేశాల్లో మైనారిటీలకు అన్యాయం జరిగిపోతోందంటూ ఇటువంటి వేదికలపై ప్రసంగించేవాళ్లు తమ దేశంలో మైనారిటీల పట్ల ఎంత అణచివేతకు పాల్పడుతున్నారో గుర్తెరగాలని చెప్పుకొచ్చారు. కశ్మీర్‌లో అభివృద్ధిపరమైన విధానాలను పూర్తిగా అమలు చేయనున్నామని ఠాకూర్ సింగ్ చెప్పారు. కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ పాక్ పూర్తిగా తప్పుడు కథనాలు, కట్టుకథలు ప్రచారం చేస్తోందని తెలిపారు. తమ భూభాగం మీద ఉగ్రవాదానికి ఆర్థిక, సైద్ధాంతిక మద్దతు ఇస్తున్న వాళ్లే అత్యంత దారుణంగా మానవహక్కులు ఉల్లంఘిస్తున్నారన్నది స్పష్టమవుతోందనన్నారు.


In Strong Counter, India Questions Pak Locus Standi on 'Sovereign Decision' to Revoke J&K Special Status
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
విడుదలకు ముందే వివాదాల చుట్టు తిరుగుతున్న'సైరా'
ఆమె రోదిస్తున్న తీరు ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది
సీఎం యోగి ఆదిత్యానాథ్ కీలక నిర్ణయం
యూపీలో ఇది తప్పకుండా అమలు చేసి తీరుతాం: సీఎం యోగి
తెలంగాణ విమోచన దినోత్సవం చరిత్ర ఇదీ..
ఇది మానవాళికి ప్రమాదంగా మారింది...హెచ్చరిస్తున్న నిపుణులు
‘రజినీకాంత్’కు టెన్షన్ పెడుతున్న అభిమానులు
హైదరాబాద్ జనాలపై ‘అణు’కుంపటి
సెప్టెంబర్ 15కు ఓ ప్రత్యేక ఉంది...అదేంటో తెలుసా..?
వార్నింగ్: బిగ్ బాస్ లో శ్రీముఖిని గాడిదతో పోల్చిన నాగార్జున
తనకున్న ఆరోగ్య సమస్యను బయటపెట్టిన ‘మహేష్ బాబు’
మరోసారి పరువు తీసుకున్న పాక్ ప్రధాని ‘ఇమ్రాన్ ఖాన్’
భూ సంస్కరణల మార్గదర్శి....హైదరాబాద్ తొలి ముఖ్యమంత్రి
హైకోర్టులో రాజీవ్ గాంధీ హంతకురాలు ‘నళిని’కి ఎదురు దెబ్బ
ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త...వచ్చే నెల 1 నుంచి అమలు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.