తెలంగాణ కోసం తెగ స్ట్రగుల్ చేస్తున్నాడు జగన్ అన్న అనుమానాలను ఆయన ప్రత్యర్థులు వ్యక్తం చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. కాని జగన్ ఆ అనుమానాలను నివృత్తి చేసే పని చేయకుండా వాటికి మరింత బలం చేకూర్చే విదంగా వ్యవహరిస్తుండడంతో ఇది నిజమేనేమో అన్న భావం క్రమేపి పెరుగుతోంది. సమైక్యం అంటున్న జనంతో కలిసి ఉద్యమం చేయకుండా దేశం అంతటా తిరుగుతానంటే ఈ అనుమానం కలగడం సహజమే అంటున్నారు. ఈ భావం ఆయన హీరో కావాలనుకుంటున్న సీమాంద్ర జనంలో నాటుకుంటే మాత్రం ఆయన రాజకీయం పెద్ద ప్రమాదంలో పడ్డట్టే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. కారణం ఆయన చేస్తున్న పనులపై వ్యక్తమవుతున్న అనుమానాలేంటో చూస్తాం.... ఆయనకు షరతులతో కూడిన బెయిల్ లభించాక తనకు రాష్ట్రం అంతటా తిరిగేందుకు అనుమతి ఇవ్వాలని ఎందుకు కోరారు. వరద బాదిత ప్రాంతాల్లో పర్యటించి వారిని పరామర్శించడం, సాయం అందించడం కోసం. కాని ఆయనకు అనుమతి వచ్చి పదిరోజులయినా కూడా ఆ పనిచేయలేదు ఎందుకు...?. ఆయన జైలు నుంచి వచ్చాక సీమాంద్రలోకి వెల్లి సమైక్యం కోసం ఉద్యమిస్తున్న జనం తో కలిసి సమైక్య పోరాటం చేస్తారు అనుకున్నారు, కాని ఇప్పటి వరకు హైదరాబాద్ లో ఓ సభ, ఓ దీక్ష, రెండు మూడు విలేఖరుల సమావేశాలు తప్ప అసలు అనుకున్న పని ఎందుకు చేయలేదు...?. కారణం ఆయన రాష్ట్రంలో సమైక్యం కోసం తిరిగితే ఏంచేయాలి, అస్తమానము సోనియాను తిట్టాలి, ప్రజలను సమైక్య ఉద్యమం వైపు రెచ్చగొట్టాలి. కాని ఇది చేస్తే సోనియా కంటున్న తెలంగాణ ఏర్పాటు, దానివల్ల రాహూల్ ప్రధాని పదవికి బలం చేకూర్చుకోవడం వంటి వాటికి ఆటంకం కదా.. అందుకే చేయలేదేమో అంటున్నారు. అంతే కాదు బాదితులను ఆదుకోవాలని రాష్ట్రంలో తిరిగేందుకు అనుమతి కోరి అది చేయకుండా ఇప్పుడు రాష్ట్రం సమైక్యంగా ఉంచడం కోసం దేశమంతా తిరగాలని అనుమతి కోరడంలో అర్థం ఏంటి...?. అంటే రాష్ట్ర విభజన ప్రక్రియ చకచకా జరిగిపోయి ఈ నెల 26 న అసెంబ్లీకి రాబోతుంది. ఈసమయంలో అడ్డుకోవడానికి ఏమి చేయకుండా ఉంటే ఎలా, అందుకే ఈ నెల 26 వరకు రాష్ట్రంలోనే ఉండకుండా, అది కూడా సమైక్యం కోసమే తిరుగుతున్నట్టుగా బిల్డప్ ఇవ్వడానికేనేమో అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ పరిశీలకులు. కారణం జగన్ – సోనియా ల మద్య జరిగిన డీల్ కుదిరిందని అందరు కోడై కూస్తున్న తరుణంలో జగన్ చేస్తున్న ఈ పనులు ఇలాంటి అనుమానాలే కలిగిస్తున్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి: