తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెల్లారిలేస్తే చాలు ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ అంటారు. తన కంటే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ దేశంలోనే  లేనే లేడంటారు. మరి అటువంటి నేత ఒక్కసారిగా విపక్షంలోకి రాగానే ఎందుకు ఇలాఅయిపోతున్నారన్నదే ప్రశ్న. అసలు చంద్రబాబు ఏప్రిల్ 11న పోలింగ్ మొదలైన గంటలోనే ప్రతిపక్షంలోకి మారిపొయారు. అది మొదలు ఫలితాలు వచ్చేంతవరకూ రకరకాలుగా మాట్లాడిన బాబు చివరికి వంద రోజుల జగన్ సంబరాల తరువాత ఎందుకో రూటే మార్చేశారు.


నిజానికి కొత్త సర్కార్ కి ఆరు నెలల పాటు సమయం ఇస్తామన్నది ఇదే చంద్రబాబు. కానీ యూటర్నులు తీసుకోవడం అలవాటైన ఆయన జగన్ ప్రమాణం చేయకముందే విమర్శలకు పనిచెప్పారు. ఇపుడు అది పరాకాష్టకు చేరుకుని చలో ఆత్మకూర్ దాకా సాగిపొయింది. ఏపీలో ప్రజా సమస్యలు లేవు  అన్నది ఓ విధంగా చంద్రబాబు ఒప్పుకున్నట్లైంది. మూడు నెలల కాలంలో బాబు నిఖార్సుగా ప్రజల గురించి మాట్లాడింది ఏదైనా ఉందా అంటే లేదన్న మాటే వినిపిస్తుంది.


ఆయన మొదట ప్రజావేదిక కోరారు. అది కూడా ఆయన కోసం. తరువాత తన అద్దె  ఇల్లు కూలగొట్టడంపైన యాగీ చేశారు. ఆ తరువాత అమరావతి ఆపొద్దని అన్నారు. అక్కడ కూడా తన వారి ప్రయోజనాలే ఉన్నాయని వైసీపీ విమర్శలు చేసింది. పోలవరంలో అవినీతిని అడగొద్దు కడగొద్దు అంటున్నారు. ఇపుడు తన పార్టీ వారిని రక్షించుకోవడం కోసం చలో ఆత్మకూర్ అన్నారు.



ఇవన్నీ చూసుకున్నపుడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు ప్రజాసమస్యల కంటే రాజకీయమే ఎక్కువ అయిపోయిందా అనిపించకమానదు. ఇక చంద్రబాబు విషయంలో మరో మాట కూడా ఉంది. ఆయన ఎందుకో జగన్ని చూసి భయపడుతున్నారన్న  ప్రచారం కూడా ఉంది. జగన్ యువకుడు, పైగా మంచి మెజారితో ఉన్నారు. వచ్చిన అవకాశాన్ని పదికాలాలు కాపాడుకునే నైజన్ జగన్ కి ఉంది.


జగన్ వందరోజుల పాలనపైన పెద్దగా విమర్శలు రాలేదు, మరో వైపు హామీలను నెరవేరుస్తున్నారన్న ఇంప్రెషన్ జనాల్లో ఉంది. ఇవన్నీ చూసుకున్నపుడు సహజంగానే బాబుకు జగన్ ఎక్కడ పాతుకుపోతాడో అన్న భయం కనిపిస్తోందని  అంటున్నారు. దాంతో  పుట్తుకువచ్చినవే చలో ఆత్మకూర్ వంటి ఆందోళనలు  అని కూడా అంటున్నారు. అయితే ఏమైనా  ప్రజల నుంచి ఉద్యమాలు రావాలి. . ప్రజా సమస్యలపైన పోరాటాలు కావాలి. ఏదో రాజకీయంగా ఒకరిని బదనాం చేద్దామనుకుని రోడ్డెక్కితే అది చివరకు బూమరాంగ్ అవుతుందని  కూడా అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: