భారతీయ జనతా పార్టీ రెండొవసారి అధికారంలోకి రావడంతో ఎక్కడికక్కడ మార్పులు ఏర్పడుతున్నాయి. ఆలా మార్పు చేసే క్రమంలోనే మొదట ఉమ్మడి రాష్ట్రానికి ఉన్న మాజీ గౌర్నర్ నరసింహన్ ను మొదట ఆంధ్ర ప్రదేశ్ నుంచి తొలిగించి కేవలం తెలంగాణకు పెట్టారు, ఇప్పుడు తెలంగాణకు తొలిగించి కొత్త గౌర్నర్ ను తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీ నేత బండారు దత్తాత్రేయను హిమాచల్ ప్రదేశ్ గౌర్నర్ గా నియమనిచారు.            


ఈ నేపథ్యంలోనే హిమాచల్ ప్రదేశ్ 27వ గవర్నర్ గా సిమ్లాలోని రాజ్ భవన్ లో బీజేపీ నేత బండారు దత్తాత్రేయ ప్రమాణస్వీకారం చేశారు. జస్టిస్ ధరమ్ చంద్ చౌదరి దత్తాత్రేయతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవంలో సీఎం జయరాం ఠాకూర్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణతో పాటు దత్తాత్రేయ కుటుంబసభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు.            


హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర సంస్కృతిలో భాగంగా ధరించే హిమాచల్ టోపీని నూతన గవర్నర్‌ బండారు దత్తాత్రేయకు సీఎం ఠాకూర్ శాలువాతో సత్కరించి అందచేశారు. ప్రమాణ స్వీకారం సందర్బంగా ఆ టోపీని ధరించి దత్తాత్రేయ ప్రమాణం చేసారు. అంతకముందు రాష్ట్రమంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు దత్తాత్రేయకు ఘనస్వాగతం పలికారు. కాగా హిమాచల్ ప్రదేశ్ 27వ గవర్నర్‌గా దత్తాత్రేయ బాధ్యతలు స్వీకరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: