టీడీపీకి చంద్రబాబు అధినేతగా ఉన్నారు. అయితే ఆయన వయసు డెబ్బయి ఏళ్ళు.  బాబు ఆరోగ్యపరంగా ఫిట్ గా ఉన్నా మరో అయిదేళ్ల పాటు ఇదే చురుకుతనంతో పార్టీని నడపగలరా అన్న బెంగ తమ్ముళ్లలో ఉంది. ఇక టీడీపీకి మరో నాయకత్వం లేదు. అన్నీ బాబు, అంతా బాబే. అలా తయారుచేశారు పార్టీని. బాబు తరువాత ఎవరు అన్న ప్రశ్న ముందుకు వస్తోందిపుడు. అదే టీడీపీకి పెద్ద మైనస్ గా ఉంది.


చంద్రబాబు నాయకత్వ లక్షణాలను ఎవరూ తప్పుపట్టడంలేదు, తక్కువ చేయడంలేదు కూడా. అసలు ఇపుడు తమ్ముళ్ల ముందు బాబు చలో అత్మకూర్ వంటివి పెట్టి  తన సామర్ధ్యాన్ని రుజువు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ముమ్మారు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు మరో మూడు మార్లు విపక్ష నేతగా ఉన్నారు. జాతీయ స్థాయిలో పలు సందర్భాంలో ఆయన కీలకంగా వ్యవహరించారు.


చంద్రబాబు నాయకుడుగా కరెక్ట్ అని తమ్ముళ్ళంతా అంగీకరిస్తారు. అయితే చంద్రబాబు ఎన్నాళ్ళు ఇదే రకమైన ఫిట్ నెస్ తో ఉంటారు. ఆయన పోరాటాలు ఈ ఏజ్ లో ఎన్నాళ్ళని చేయగలరు, ఇదే తమ్ముళ్లను వేధిస్తున్న ప్రశ్న. ఇక టీడీపీలో బాబు తరువాత రెండవ నాయకత్వం లేదు. లోకేష్ ని బాబు భావి వారసునిగా చూపిస్తున్నా కూడా తమ్ముళ్ళెవరికీ నమ్మకం లేదు. లోకేష్ ని ఇంకా పొలిటికల్ బేబీ అని భావిస్తున్నారు.


మరో వైపు చూసుకుంటే టీడీపీలో ఉన్న నాయకుల ఏజ్ కూడా తక్కువేం కాదు, మరో అయిదేళ్ళు అధికారానికి దూరంగా ఉండాలంటే వారి వయసు కూడా ఎంతవరకు సహకరిస్తుంతో తెలియదు. అదే సమయంలో అప్పటి రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయన్నది కూడా ఎవరికీ తెలియదు, ఇదే రకమైన ఆలోచనలతోనే టీడీపీకి తమ్ముళ్ళు గుడ్  బై కొడుతున్నారు. వైసీపీలో యువ నాయకత్వం ఉంది.  ఇప్పటికిపుడు అయిదేళ్ల అధికారానికి గ్యారంటీ ఉంది. జగన్ మరిన్ని విజయాలు సాధించే సత్తా కలిగి ఉన్నారు. అందుకే టీడీపీ నుంచి వైసీపీలోకి నేతల జంప్ అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: