ఎన్నో ప్రయత్నాలు ...మరెన్నో విమర్శలు ...విమర్శలు వచ్చాయని వెనకడుగు వేయకుండా దృఢ సంకల్పంతో ముందుకు సాగిన గొప్ప క్రీడాకారిణి పీవీ సింధు .ఇప్పటికే ఎన్నో రికార్డులు సృష్టించిన సింధు .ఒలంపిక్స్  లో రజతం  సాధించిన మొదటి మహిళగా సింధు రికార్డు సృష్టించింది . ఇలా ఎన్నో పోరాటాలు చేసింది . అంత సవ్యంగానే ఉంది విజయం తన సొంతం అయినట్టే అనుకున్న తరుణంలో సింధు అపజయం పాలయ్యేది. దీంతో యావత్ భారతం సింధుకు ఫైనల్ ఫోబియా ఉంది...ఫైనల్లో గెలవలేదు  సిల్వర్ సింధు అంటూ విమర్శించారు .కానీ సింధు  పట్టుదలతో తన పోరాటాన్ని కొనసాగించి అనుకున్నది సాధించింది . విమర్శకుల నోళ్లు మూయిస్తూ ప్రపంచ బ్యాట్మింటన్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం సాధించి త్రివర్ణ పతాక గౌరవాన్ని పెంచి రెపరెపలాడించింది . 


ఇప్పటికే పలు రాజకీయ నాయకులు , ప్రముఖులు సింధుకి శుభాకాంక్షలు తెలుపగా ... నేడు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ని సింధు తన తల్లి తండులతో కలిసి సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు . సింధు బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ సాధించటం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సీఎం జగన్ సింధుని శాలువాతో ఘనంగా సత్కరించారు . కాగా తన గెలిచినా బంగారు పథకాన్ని సీఎం జగన్ కి చూపించారు.అనంతరం ఒక బ్యాట్మింటన్ బ్యాట్ సింధు సీఎం జగన్ కి బహుకరించారు . .అనంతరం మాట్లాడిన సింధు  ...మూడు ప్రయత్నాల తర్వాత బాట్మింటన్ ఛాంపియన్ షిప్ సాధించానని తెలిపారు .ఈ సందర్బంగా సింధు మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు తనకు కాల్ చేసి శుభాకాంక్షలు తెలుపగా ...ఆయనని కలిసి కృతజ్ఞతలు తెలపడానికి వచ్చానని తెలిపింది పీవీ సింధు . కాగా  పద్మభూషణ్ అవార్డుకు తన పేరు పరిశీలనకు వెళ్లడం ఎంతో ఆనందంగా  ఉందని  సింధు అన్నారు. విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు   అయిదు ఎకరాల స్థలం కేటాయిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని సింధు తెలిపారు .ఈ సందర్బంగా సింధు మాట్లాడుతూ 


మరింత సమాచారం తెలుసుకోండి: