ఇప్పుడు సుఖంగా ప్రయాణించే మెట్రో రైళ్ల వెనకాల చాలా పెద్ద చరిత్రేవుంది.ఇప్పుడంటే అత్యంత ఆధునిక టెక్నాలజీతో ఈ రైల్లు పరిగెత్తుతున్నాయి గాని మొట్టమొదటి మెట్రో రైలు మార్గం వేసినప్పుడు పడిన శ్రమ గురించి ఎంత చెప్పిన తక్కువే. అప్పుడు ఎలాంటి మిషనరీలు లేవు అంతా మనషులే ఆ పనిని పూర్తిచేసేవారు.అప్పుడు వారు ప్రాణాలను లెక్కచేయకుండా పడిన కష్టమే ఈనాడు సౌకర్యాల పేరిట అనుభవిస్తున్నాము.అది సరే ప్రపంచంలో తొలి మెట్రోపాలిటన్ రైలు వ్యవస్థను ఎక్కడ ప్రారంభించారో తెలుసా?దిక్కులు చూడకండి తెలియకుంటే ఇప్పుడు తెలుసుకుందాం.



అది లండన్‌లో 1863లో ప్రారంభించారు.భూగర్భం ద్వారా రైల్వే లైన్లు వేశారు.ఇక కొత్త మురిపం కాబట్టి తొలిరోజు దాదాపు 30,000 మంది ప్రయాణించారట.ఇక విద్యుత్‌తో నడిచే తొలి రైలు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత అంటే 1890లో ప్రారంభమైందన్న మాట.ఇక 1863లో మెట్రో ట్రైల్ రన్ సందర్భంగా పోర్ట్‌ల్యాండ్ రోడ్ స్టేషన్ వద్ద గాలిలో టోపీలు ఊపుతూ ఎందరో తమ ఆనందం వ్యక్తం చేశారట.ఇక ప్రస్తుతం  ప్రభుత్వ అధీనంలోని లండన్ అండర్‌గ్రౌండ్ లిమిటెడ్ మెట్రోను నిర్వహిస్తోంది.ఇక్కడ మొత్తం 270 స్టేషన్లు, 400 కిలోమీటర్ల నెటవర్క్ ఉంది.రోజుకు సుమారు 50 లక్షల మంది ఈ రైళ్ల ద్వారా ప్రయాణిస్తారు.



తొలిసారి ట్రావెల్ కార్డు‌ 1983లో తీసుకు రాగా,కాంటాక్ట్‌లెస్ కార్డ్‌ 2003లో తీసుకొచ్చింది.ఇక్కడి మెట్రో రైలు వ్యవస్థలో మొత్తం 11 లైన్లు,దాదాపు 12 మెట్రో డిపోలు ఉన్నాయి. ప్రపంచంలోనే అతి ఎక్కువ స్టేషన్లు ఉన్నది న్యూయార్క్ సిటీ సబ్‌వే మెట్రోలోనే, ఇక్కడ దాదాపు 472 స్టేషన్లు ఉండగా రోజుకు సుమారు 60 లక్షల మంది ఈ మెట్రో ద్వారా ప్రయాణిస్తారు.ఇక 1904 లో ప్రారంభించిన సిటీ సబ్‌వే మెట్రో 2019 నాటికి 115 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.ఇక ఇది 24 గంటలూ ఇది సేవలు అందిస్తూ ఉండటం విశేషం. 


మరింత సమాచారం తెలుసుకోండి: