జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై జాతి మీడియా రాతలైపోయి జాతీయ మీడియా మొదలుపెట్టింది.  ఎక్కడో కూర్చుని ఓ ముఖ్యమంత్రి పరిపాలనపై అభిప్రాయానికి రావటం,  తీర్పు ఇచ్చేయటం జాతీయ మీడియాకు  మామూలే. ఇపుడు జాతీయ మీడియా చేసిందిదే.  జాతీయ స్ధాయిలో ప్రముఖంగా ఉన్న టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ ప్రెస్, హిందుస్ధాన్ టైమ్స్, ట్రిబ్యూన్, ఏషియన్ ఏజ్, ఎకనమిక్ టైమ్స్ ఏషియన్ ఏజ్ జగన్ కు వ్యతిరేకంగా రాసిన రాతలే ఇందుకు నిదర్శనం.

 

విచిత్రమేమిటంటే జగన్ పాలనపై జనాల్లో లేని వ్యతిరేకత జాతీయ మీడియాకు కనబడటం. అదే సమయంలో చంద్రబాబు హయాంలో జరిగిన బ్రహ్మాండమైన అభివృద్ధిని జగన్ ఆపేశారని రాశాయి. రాజధాని పనులను నిలిపేయటం, పిపిఏలను సమీక్షించటం, రాజకీయ కక్షతోనే రీ టెండరింగ్ కు వెళ్ళటంపై ఏకంగా సంపాదకీయాలు రాసేశాయి.

 

నిజానికి ఢిల్లీలోనో, ముంబాయిలోనే కూర్చుని జగన్ పై సంపాదకీయాలు రాసేయటం చాలా సులభం. ఓ సారి సంపాదకీయాలు లేదా ప్రత్యేక కథనాలు  రాసే ముందు తమ రిపోర్టర్లను ఓసారి క్షేత్రస్ధాయికి పంపి వాస్తవాలపై ఫీడ్ బ్యాక్ తెప్పించుకోవాలి.  వాటి సంపాదకీయాల ప్రకారం బ్రహ్మాండంగా ఉన్న చంద్రబాబు పాలనను జగన్ దెబ్బతీశారట. తన హయాంలో అభివృద్ధి చేయటమే కాక సంపదను కూడా చంద్రబాబు సృష్టించారని సంపాదకీయాల్లో రాయటమే విచిత్రం.

 

అవి రాసిన సంపాదకీయాలు చూస్తే తెర వెనుక ఏదో మ్యానేజ్ జరిగినట్లే అనుమానాలు మొదలయ్యాయి. పై మీడియా రాసినంత స్ధాయిలో రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు, రాజధానిలో నిర్మాణాలూ చేపట్టలేదు. జరిగిందంతా అభివృద్ది, రాజధాని ముసుగులో భారీ అవినీతి మాత్రమే. ప్రచారం జరుగుతున్న స్ధాయిలో చంద్రబాబు రాష్ట్రాన్ని, రాజధానిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తే మొన్నటి ఎన్నికల్లో జనాలు ఎందుకు టిడిపి గూబ పగలగొట్టారు ?  సంపాదకీయాలు రాసేముందు జాతీయ మీడియా ఒక్కసారి ఈ విషయాన్ని తమను తాము ప్రశ్నించుకునుంటే బాగుండేది.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: