చంద్రబాబు భలే మేనేజ్ చేసాడు అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఆయన జిఓఎం, అఖిలపక్షం సమావేశానికి వెల్లొద్దని నిర్ణయించడం తెలంగాణ నేతల్లో ఆగ్రహం కల్పించింది. ఈ విషయం తెలంగాణ టిడిపి నేతలు బహిరంగంగానే చెప్పారు. అంతే కాదు ఆయన ఈ నెల 15 నుంచి ఆత్మగౌరవయాత్రను కూడా సీమాంద్రలో చేపడుతుండడంతో ఇక ప్రమాదమే అని భావించి తెలంగాణ టిడిపి నేతలు, ఎమ్మెల్యేలు పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారని కూడా వార్తలు వినిపించాయి. అంతే కాదు ఏకంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యే, నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా టిఆర్ఎస్ లోకి చేరుతున్నారని వదంతులు వినిపించాయి. కాని హఠాత్తుగా తెలంగాణ టిడిపి నేతలు చంద్రబాబు వైఖరిని సమర్థించడంతో బాబోయ్ చంద్రబాబు తెలంగాణ నేతలను భలే మేనేజ్ చేసాడు అన్న మాటలు వినిపిస్తున్నాయి రాజకీయ వర్గాల్లో. చంద్రబాబు సోమవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంలో తెలంగాణ నేతలతో మేథో మథన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో తెలంగాణ నేతలంతా చంద్రబాబుకు వంత పాడడమే దీనికి కారణం. అంతే కాదు ఈ సదస్సు తర్వాత తెలంగాణ తెలుగుదేశం ఫోరం కన్వీనర్, బాబు వైఖరినే కాదు, పయ్యావులు, కోడెల వంటి వారిపై తీవ్ర వాఖ్యలు చేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ చంద్రబాబును తెగ పొగిడారు. తెలంగాణలో టిడిపినే టాప్ అని అన్నారు. చంద్రబాబు పాదయాత్ర చేసినప్పుడు తెలంగాణలో వచ్చిన జనంలో సగం కూడా తెలంగాణ కాంగ్రెస్ జైత్రయాత్ర సభలకు రావడం లేదన్నారు. చంద్రబాబు ఢిల్లీలో దీక్ష చేసినప్పుడు తెలంగాణలో పార్టీ ఇబ్బందుల్లో పడ్డదని అన్నారు, అయినా కూడా దానిని అధిగమించాం, ఇక ముందుకూడా ఇబ్బందులను అదిగమించాలి అన్నారు. అంటే చంద్రబాబు వారిని మేనేజ్ చేసినట్టే కదా అంటున్నాయి రాజకీయ వర్గాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: