పచ్చటి అడవితల్లి మీద పగబట్టారు ...యురేనియం తవ్వకాలంటూ అడవి తల్లిని ప్రాణం తీసేందుకు  సిద్ధం అయ్యారు. అభయారణ్యాని యురేనియం తవ్వకాలతో మింగేయాలని చూస్తున్నారు . యురేనియం తవ్వకం కోసం అధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అడవితల్లిని నమ్ముకున్న జీవిస్తున్న గిరికూనలు తమ ప్రాణాలు అర్పించైన తవ్వకాలను అడ్డుకుంటామని పోరాటానికి సిద్ధమయ్యాయి.  దీంతో తెలుగు రాష్ట్రాలు సేవ్ నల్లమల్ల అంటూ గళమెత్తింది. 


ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులూ , సినీ ప్రముఖులు సేవ్ నల్లమల్ల ఉద్యామానికి మద్ధతు తెలిపారు. మరోవైపు ప్రజా సంఘాల నాయకులూ నల్లమల్లలో యురేనియం తవ్వకాల వల్ల ఎన్ని అనార్థాలు జరుగుతాయో ప్రజలకి అవగాహన కలిపిస్తూ చైతన్య వంతులను చేస్తున్నారు. సేవ్ నల్లమల్ల ఉద్యమానికి రోజు రోజుకి మద్దతు పెరుగుతుంది.


యురేనియం తవ్వకాల వ్యవహారంపై కేటీఆర్ ట్విటర్ ద్వారా స్పందించారు. నల్లమలలో యురేనియం తవ్వకాలపై ప్రజల ఆవేదనను పరిగణలోకి తీసుకుంటామని వెల్లడించారు. ఈ అంశాన్ని వ్యక్తిగతంగా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేస్తూ ట్విట్టర్ వేదికగా స్పందించారు. అయితే కేటీఆర్ ట్వీట్ పై ఎంపీ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ గారు ముందు సేవ్ నల్లమల్ల పై మీ సురభి నాటకాలు కట్టిపెట్టి ...యురేనియం తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలంటూ ఫైర్ అయ్యారు. 


ఇప్పుడు తెలంగాణలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. సెలబ్రెటీలు సేవ్ నల్లమల్ల అంటూ ట్వీట్ చేస్తూ ఉద్యామానికి ఊపు తెస్తున్నారు. ప్రతి ఒక్కరు దీనిపై చర్చిస్తూ..ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పబడుతున్నారు. ఎన్నో జీవరాశులు, ప్రకృతి అందాలకు నిలయంగా మారిన నల్లమల్లను కాపాడండి అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు మరి ఇంత మంది ప్రజలు ఆందోళనను ప్రభుత్వం పట్టించుకుంటుందా..నల్లమల్లను, గిరికూనలను కాపాడుతుందా..లేక ఇదంతా మాకనవసరం తవ్వకాలు జరిపి తీరుతామని పట్టుబడుతుందా చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: