ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఘాటైన విమర్శాలు ప్రతి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి . ఇప్పటికే చంద్రబాబు పిలుపునిచ్చిన  చలో ఆత్మకూరు పేరుతో రాష్ట్రం అట్టుడికిపోగా ఇప్పుడిప్పుడే పరిస్థితులు సద్దుమణుగుతున్నాయి. అయితే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటైన విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు.తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలంగా మారాయి .


రాష్ట్రంలోని పాఠశాలల్లో మరుగుదొడ్లు సరిగ్గా లేక .. ఎంతో మంది అమ్మాయిలు చదువు మానేసేందుకు సిద్ధమవుతున్నారు . అధికార పార్టీ  నేతలకు కూడా బిడ్డలు ఉన్నారు కదా ... మరి ఇతర అమ్మాయిల విషయంలో అంత నిర్లక్ష ధోరణి ఎందుకు చూపిస్తున్నారని  విమర్శించారు.కనీసం పాఠశాలల్లో అమ్మాయిలకు సరైన మరుగుదొడ్లు నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అంటూ ఫైర్ అయ్యారు.


కాగా మద్యం వల్ల వచ్చే ఆదాయం తమకు అవసరం లేదని రాష్ట్రంలో మద్యం నిషేదించేలా చర్యలు తీసుకుంటామని  వైసీపీ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ రాష్ట్రము మద్యం అమ్మకం మాత్రం రికార్డు స్థాయిలో పెరుగుతుందన్నారు .రాష్ట్రంలో సంపూర్ణ మధ్య నిషేధం చేస్తామని ప్రభుత్వం అన్నప్పటికీ ...అవి కేవలం మాటల వరకే పరిమితమైందన్నారు. వైసీపీ నేతలు విస్కీని ప్రోటీన్ షేక్ గా ...బ్రాందీని బోర్నవిటాగా ముందుకు తీసుకెళ్తారేమో అనిపిస్తుందంటూ సెటైర్ వేశారు పవన్ .


ఈ సందర్బంగా పోలవరం గురుంచి మాట్లాడుతూ ... పోలవరంలో తప్పులుంటే సరి చేసి పనులు చేయాలి అంతే కానీ పూర్తిగా టెండర్లను నిషేదించడం ఏంటని ప్రశ్నించారు. ఈ నిర్ణయం తో ప్రజాధనం వృధా అవుతుందని దుయ్యబట్టారు. పోలవరం టెండర్ల నిలిపివేయటం తో రాష్ట్రానికి ఎంతో నష్టం జరుగుతుందన్నారు. టెండర్లు ఆపేసి బొత్స తన ఆస్తులను అమ్మి పోలవరం పూర్తి చేస్తారా అని విమర్శించారు పవన్ .


మరింత సమాచారం తెలుసుకోండి: