శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ , 65  సంవత్సరముల ఘన చరిత్ర కలిగిన యూనివర్సిటీ, ప్రకాశము పంతులు గారు, నీలం సంజీవ రెడ్డి గారి వంటి మహామహుల చేతుల మీదుగా 1954  లో  ప్రారంభించబడి ఎందరో మహానుభావులను జాతికి అందించిన ఘన చరిత్ర కలిగి రాయలసీమ, నెల్లూరు వాసులందరికీ, ముఖ్యముగా యువతకు  ఉపయోగ  పడుతున్న ఘన విశ్వ విద్యాలయం ఇది. 


పాఠశాలలు, కళాశాలలు దేవాలయాలంటారు, ఇక్కడ పనిచేసే సిబ్బంది తాము చేస్తున్నది ఉద్యోగము మాత్రమే కాదు, సమాజాన్ని, దేశాన్ని నిర్మించడము అనే బాధ్యతతో మెలగాలి అని వేనోళ్ళ చెబుతూ ఉంటారు ... వీటన్నింటికంటే ఉత్కృష్ఠ స్థాయిలో ఉన్న విశ్వ విద్యాలయాల ప్రాముఖ్యతనైతే చెప్పనలవి కాదు... విశ్వ విద్యాలయాలలో పని చేసే సిబ్బంది అయితే ఆ ప్రాంతాన్నే కాదు ... మొత్తం జాతి ని ప్రభావితం చేయగలవారు కాబట్టి వారి ప్రవర్తన మంచికి సోదాహరణముగా ఉండాలంటారు.


ఇంత ఘన చరిత్ర కలిగిన ఎస్వీయూ ను కించ పరిచే విధముగా ఉన్నట్లయింది ప్రస్తుత ఇంచార్జి రిజిస్ట్రార్ వ్యవహరిస్తున్న తీరు...  కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పలు సాంకేతిక సర్వీసులని అందిస్తున్న కంపెనీ ప్రతినిధిని సాక్షాత్తు ఇంచార్జి రిజిస్ట్రార్ మీటింగ్ కు రిజిస్ట్రార్ ఆఫీస్ కు రమ్మని పిలిచి, ఆ కంపెనీ వారు పనిచేస్తున్న పని గురించి అనుభవము, సంబంధము లేని దాదాపు 6 - 10  సభ్యులు ఆ కంపెనీ ప్రతినిధి వికలాంగుడనే విచక్షణ జ్ఞానం కూడా లేకుండా మాటల దాడి, హావ భావాలతో ఆ వికలాంగుడిని మానసికంగా ఇబ్బంది పెట్టిన సంఘటన అదీ రిజిస్ట్రార్ ఆఫీస్ లోనే .... 


ఆ ప్రతినిధి మీరు ఏ విషయాలనైనా అధికారికంగా తెలియ పెరచండి, అఫీషియల్ గా మా సాంకేతిక, న్యాయ బృందం మా కంపెనీ వాదనను మీకు అధికారికంగా తెలియపరుస్తారు... నన్ను ఇలా ఇబ్బంది పెట్టడం మీకు భావ్యం కాదు అని పలు విధములుగా చెప్పచూసినప్పటికీ వినకుండా... వెళతానన్న ఆయనను వెళ్లనీయకుండా ౩౦ నిముషములకు మించి ఒక రకముగా చెప్పాలంటే నిర్బంధించి.... ఆ వికలాంగ ప్రతినిధి తనకు సంతకం పెట్టె అధికారం లేదు, తాను సంతకం చేయనని, సంతకం చేయడం తనకు ఇష్టం లేదని కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పినా కూడా...  తమకు కావలసిన డాక్యూమెంట్లపై సంతకం పెట్టించుకుని మరీ వదిలిన విషయం లేటుగా వెలుగులోకొచ్చింది.


ఒక విశ్వ విద్యాలయములో ఇటువంటి నడవడి అందులోనూ సాక్షాత్ రిజిస్ట్రార్ చాంబర్స్ లో జరగడము, మాటల దాడి, హావ భావ దాడి, మానసిక దాడి అందులోనూ ఒక వికలాంగుడిపై దాదాపు 6 నుండి 10  మంది వరకు దాడి చేసిన విధానం సమాజానికే సిగ్గు చేటు తెచ్చే విధముగా ఉందని సాక్షాత్ ఎస్వీయూ సిబ్బందే చెవులు కోరుక్కుంటున్నారట. 


ఇంతకూ కోసమెరుపేమిటంటే, ఈ కంపెనీ వైస్సార్సీపీ సానుభూతి పరులదనీ, కంపెనీ వ్యవస్థాపకుడు, ఈ వికలాంగ ప్రతినిధీ వైస్సార్సీపీ కు సంబంధించిన వారనీ... ఇంతకు ముందు అధికార పార్టీ కు సంబంధించిన TNSF వీరి మీద నెలకో ప్రదర్శన, వారానికో పెయిడ్ ఆర్టికల్ రాయించారని... దానికి కూడా ఈ కంపెనీ వారి సాంకేతిక పూర్తి పారదర్శకత రావడము, ఎస్వీయూ లో అమ్యామ్యాలకు చెక్ పడడము నచ్చని కొంతమంది సిబ్బందే వీరిని వైస్సార్సీపీ అభిమానులు, కార్యకర్తలు అంటూ ఇబ్బంది పెట్టారట... 


రామేశ్వరము పోయినా శనేశ్వరము వదల్లేదన్నట్లుగా వైస్సార్సీపీ పూర్తి పారదర్శక పాలన వచ్చిన తరువాత కూడానా ఎస్వీయూ  రిజిస్ట్రార్ ఇంతకు ముందు ఉన్న అధికార పార్టీ యొక్క ఎజెండాను తన భుజ స్కంధాలమీద మోస్తున్నారు... అసలైన వైస్సార్సీపీ అభిమానులను, ప్రతిభ ఉన్నవారినే... అతి త్వరగా పూర్తి కాలం రిజిస్ట్రార్ గా నియమించాలని కోరుకుంటున్నారుట ఎస్వీయూ పరిధిలోని విద్యార్థులు, ఆచార్యులు, ప్రజలు.


మరి వీరి ఘోష  "జన ప్రియ నాయకుడు శ్రీ వై ఎస్ జగన్ మోహన రెడ్డి " గారి దృష్టికి వెళ్లాలని, ప్రజల ముఖ్యమంత్రి జగనన్న ఇలాంటి హేయమైన ఘటనలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం మనము కూడా.


ఇండియా హెరాల్డ్ ఎల్లప్పుడూ నిస్సహాయులకు అండగా ఉంటుంది, ఒక వికలాంగుడిపై ఎస్వీయూ ప్రతాపం అనేది ఎట్టి పరిస్థితులలోనూ సమర్థనీయము కాదు కదా, అందులోనూ అతను నా చేతిలో ఏమీ లేదు, మీకు ఎటువంటి విషయాలనైనా అధికారికంగా లేఖ పంపిస్తే మా కంపెనీ వారు జవాబు ఇస్తారని చెప్పిన తరువాత కూడానా అని విస్తుపోతున్నారు ఆంధ్ర ప్రజ... 


అస్సలు ఈ కంపెనీ వారు సంవత్సరాల తరబడి సర్వీస్ చేసినప్పుడు సంబంధం లేనివారిని, అధికారికంగా నియమింప పడని వారిని ఇలా నిస్సహాయులు మీదకి ఎగదోలడము ఈ కార్యక్రమము మొత్తము రిజిస్ట్రార్ కార్యాలయంలో, సాక్షాత్ ఇంచార్జి రిజిస్ట్రార్ సమక్షంలో జరగడము దేనికి సంకేతం ? 
దీనిపట్ల మీ స్పందన తెలియ చేయగలరు. ఇది నాకు సంబంధినిచ్చింది కాదు అని ఊరుకుంటే రేపు ఇలాంటి సమస్య మన గుమ్మం ముందునే నిలబడొచ్చు ఏమంటారు ?


మరింత సమాచారం తెలుసుకోండి: