అవినీతికి ముద్దు బిడ్డలు రాజకీయ నాయకులని చెప్పుకుంటారు ప్రజలు.ఎక్కడచూడు,ఏ పనిలో చూడు వారి హస్తం,జోక్యం తప్పని సరిగ్గా ఉంటాయని విమర్శిస్తున్నారు ప్రజలు.అన్నీంట్లో రాజకీయాలు తప్పకుండా వేలు పెడతాయి ఎందుకో తెలియదు.వారికి తెలియదా ఓ వ్యవస్ద సరిగ్గా తయరవ్వాలంటే అందులో నీతిగా ఆలోచించే వారి సహకారం వుండాలని,అలాంటి వారు మచ్చుకైన కనబడనిది రాజకీయమని,ఇక విశ్వ విద్యాలయాలంటే ఓ భావితరానికి కావలసిన పటిష్టమైన,పునాదులు వేసే సంఘమని.అవి ఎంత న్యాయంగా తమ విధులను నిర్వహిస్తే అంతే బుద్ధిమంతులైన విద్యార్దులు తయారై ముందు తరానికి బాసటగా నిలుస్తారని.అందుకే వెనకటి తరంలో ఇంతలా యూనివర్శిటీలను రాజకీయ చెదలు పట్టలేదు కాబట్టి సంఘవిద్రోహులు కాకుండా,సంఘ సంస్కర్తలు బయటకు వచ్చారు.వారిలో గొప్ప గొప్ప మహానుభావులు వున్నారు.



ఇప్పుడున్న వ్యవస్దలో నేను గొప్పవాడిని అవ్వాలని ఆశతో యూనివర్శిటి చదువులు చదివే యువత ఆశయాలను ఆదిలోనే రాజకీయాలు అణగద్రొక్కుతున్నాయంటు కొందరు విమర్శిస్తున్నారట.అందుకు ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఎన్నో సంఘటనలు ఉదాహరణలుగా నిలిచాయి.వాటిలో వికలాంగుడిపై దాడికి పాల్పడటం.డిగ్రీ రెండో సెమిస్టర్‌ పరీక్ష ఫలితాల్లో తప్పులు దొర్లడం.విద్యార్థిల్లు ఆత్మహత్యలు చేసుకోవడం.ఇంతే కాకుండా బయటి వారు యూనివర్శిటి విషయాల్లో తలదూర్చడం చేయడం వల్ల విద్యార్ధులకు జ్ఞాన మందిరాలుగా ఉండవలసిన విశ్వ విద్యాలయాలు,రాజకీయాలకు అడ్డాలుగా మారుతున్నాయంటు పలువురు ధ్వజమెత్తుతున్నారట.



వీరి అనవసరమైన జోక్యాలవల్ల మంచి మంచి పేరున్న విశ్వ విద్యాలయాలు సైతం చెడ్డపేరుని అంటగట్టుకుని ఓ మచ్చలా మిగిలిపోతున్నాయని విద్యార్ధులు వెల్లడిస్తున్నారు. ఏ విషయంలో నైన అతి అనేది పనిచేయదని ఇప్పటికైన బలహీనంగా వున్న విద్యావ్యవస్ద పునాదులను బలపరచాలని,యూనివర్శీటిల్లో రాజకీయ నాయకుల జోక్యాలను తగ్గించి ముందుకు కొనసాగించాలని విద్యార్ధి సంఘాల నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారట.విశ్వ విద్యాలయాలంటే బయపెట్టి పనులు చేపించుకునే గోడౌన్లు కాదని,విద్యంటే డబ్బులు పెట్టి కొనుక్కునే సర్టిఫికెట్స్ కాదని గ్రహించి,విశ్వ విద్యాలయాల్లో జరిగే అవినీతికి వెంటనే అంతం పాడాలని విద్యార్ధులు అభిప్రాయపడుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: