Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Oct 18, 2019 | Last Updated 9:57 pm IST

Menu &Sections

Search

మోదీ పుట్టిన రోజు...కేటీఆర్ ట్వీటు...బంగారు కిరీటం...

మోదీ పుట్టిన రోజు...కేటీఆర్ ట్వీటు...బంగారు కిరీటం...
మోదీ పుట్టిన రోజు...కేటీఆర్ ట్వీటు...బంగారు కిరీటం...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బీజేపీ ర‌థ‌సార‌థి, ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం నేప‌థ్యంలో...ఆయ‌న అభిమానులు, వివిధ పార్టీల నేత‌లు, ప‌లువురు వినూత్న రీతిలో కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ మోదీ జ‌న్మ‌దినాన్ని పురస్కరించుకొని  ఆయనకు  శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల తరఫున మోదీకి శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ప్రధాని మోదీకి ఉండాలని ఆకాంక్షించినట్టు చెప్పారు.


కాగా,  టీఆర్ఎస్ పార్టీ నేత‌, తెలంగాణ  రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్  ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో, సంతోషంతో మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటూ.. సుదీర్ఘ కాలం ప్రజలకు సేవ చేయాలని కేటీఆర్ ట్వీట్ చేశారు. మోదీ 69వ పుట్టిన రోజు సందర్భంగా కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆయనకు బర్త్‌డే విషెస్ చెప్పారు. 


మ‌రోవైపు....ప్రధాని నరేంద్ర మోదీని అమితంగా అభిమానించే ఓ వ్యక్తి.. ఆయన జన్మదినం సందర్భంగా.. హనుమాన్‌కు బంగారు కిరీటాన్ని సమర్పించి మొక్కు తీర్చుకున్నాడు. వారణాసి నియోజకవర్గానికి చెందిన అర్వింద్ సింగ్ అనే వ్యక్తి.. మోదీ రెండోసారి అధికారంలోకి వస్తే బంగారు కిరీటాన్ని సమర్పిస్తానని ఎన్నికల సమయంలో మొక్కుకున్నట్లు సింగ్ తెలిపారు. ఇవాళ మోదీ బర్త్‌డే సందర్భంగా ఆ బంగారు కిరీటాన్ని దేవునికి సమర్పించానని చెప్పారు. ఈ కిరీటం 1.25 కేజీల బరువున్నట్లు పేర్కొన్నారు. గత 75 ఏళ్లలో జరగని అభివృద్ధి ఇప్పుడు మోదీ హయాంలో జరుగుతుందన్నారు అర్వింద్ సింగ్. భారతదేశానికి మంచి రోజులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.


ఇదిలాఉండ‌గా...అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వైట్‌హౌజ్‌లో రిపోర్ట‌ర్లు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు బ‌దులిస్తూ.. మోదీని త్వ‌ర‌లో క‌లుసుకోనున్న‌ట్లు ట్రంప్ తెలిపారు. భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, పాకిస్థాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌ల‌ను త్వ‌ర‌లోనే క‌ల‌వ‌నున్న‌ట్లు తెలిపారు. రెండు ఆసియా దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌ ప‌రిస్థితులు త‌గ్గిన‌ట్లు ట్రంప్ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. ఈనెల 22న హూస్ట‌న్‌లో జ‌ర‌గ‌నున్న హౌదీ మోదీ స‌భ‌కు ట్రంప్ హాజ‌రుకానున్నారు. అయితే ఈనెల చివ‌ర్లోనే న్యూయార్క్‌లో జ‌ర‌గ‌నున్న ఐక్య‌రాజ్య‌స‌మితి జ‌న‌ర‌ల్ అసెంబ్లీ స‌మావేశాల్లోనూ పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్‌తో ట్రంప్ భేటీకానున్న‌ట్లు తెలుస్తోంది.


prime minister modi birthday wishes by ktr and another fan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హైద‌రాబాద్ మెట్రోకు ఏమైంది...ఎందుకీ వ‌రుస ప్ర‌మాదాలు?
కేసీఆర్‌కు బీపీ పెంచే జాబితాలో చేరిన ప‌వ‌న్‌
సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన జ‌య‌ప్ర‌ద‌...ఈ దెబ్బ‌తో...
ఆర్టీసీ స‌మ్మె....బీజేపీ కీల‌క ప్ర‌క‌ట‌న‌
తెలంగాణ‌లో స‌మ్మె ..ఓలా కీల‌క నిర్ణ‌యం
మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల‌కు తెలంగాణ స‌హాయం...ఎలాగో తెలుసా?
కేసీఆర్‌పై కొత్త డౌట్లు పుట్టించిన విజ‌య‌శాంతి
మెక్సికోలో క‌ల‌క‌లం...మ‌నోళ్ల‌ను వెన‌క్కు పంపిన అధికారులు
రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారుల‌ను కేటీఆర్ ఏం కోరారో తెలుసా?
రాజ‌ధానిలో ఉన్నారా...ఈ విష‌యం తెలుసుకోలేక‌పోతే అంతే సంగ‌తి
ఇంకో కేసులో బుక్క‌యిన ర‌విప్ర‌కాశ్‌...ఎక్క‌డికి తీసుకువెళ్తున్నారంటే...
హ‌ర్యానాలో కాంగ్రెస్ గెలిచే అవ‌కాశాలే లేవా...అందువ‌ల్లే ఇలా..
మ‌హారాష్ట్రలో మ‌నోళ్ల‌పై మ‌ళ్లీ దాడులు...ఆందోళ‌న‌ల‌తోనే అధికారం!
కేసీఆర్ సంచ‌ల‌నం సృష్టిస్తారా...ఈ మీటింగ్‌లో ఏం తేల‌నుంది?
క్ల‌ర్క్ నుంచి కోట్ల‌కు అధిప‌తి...ఎవ‌రీ క‌ల్కీ...ఎలా ఎదిగారు?
వైసీపీ బాట‌లో ముఖ్యనేత‌లు...కీల‌క స‌మావేశం ఖ‌రారు చేసిన ప‌వ‌న్‌
అయోధ్య కేసులో రికార్డు..అదే ఉత్కంఠ‌..టెన్ష‌న్ తేలేదీ ఎప్పుడంటే..
ఓవైపు చ‌ర్చ‌లు...మ‌రోవైపు షాకులు.. తెలంగాణ స‌ర్కారు కొత్త స్కెచ్‌
పాక్‌కు మ‌రో షాక్‌...ఎన్నిక‌ల కోస‌మే కాదుగా మోదీజీ?
ఎస్‌బీఐ మ‌రో షాక్‌...ఇది పిడుగులాంటి వార్తే
ఈ రెండు రోజులే..కేసీఆర్‌కు అతి పెద్ద చాలెంజ్‌
తేడా చేసిన ఎంపీల తిక్క కుదిరింది...ఇళ్ల‌కు క‌రెంట్‌, నీరు క‌ట్‌
ఓరినాయ‌నో...పాక్ కామెడీలు మామూలుగా లేవు క‌దా..నెటిజ‌న్ల పంచులే పంచులు
కుక్క చ‌నిపోతే అంత చేశావు...ఇప్పుడు చ‌ప్పుడు లేదేం కేసీఆర్‌?
నేను అలా చేయ‌ను...ఆర్టీసీ స‌మ్మెపై కేకే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
సోనియా ఓ చ‌చ్చిన ఎలుక‌...నువ్వు ఓ గాడిద‌వు
ఢిల్లీ ఫోక‌స్‌...గ‌వ‌ర్న‌ర్‌కు పిలుపు...కేసీఆర్‌కు ఇర‌కాట‌మేనా?
ఫ‌లించిన విజ‌య‌సాయిరెడ్డి కృషి....ఏపీలో ఆ విమాన సేవ‌ల పున‌రుద్ధ‌ర‌ణ‌
కేసీఆర్‌కు కోర్టులో షాకులు...కార్మికుల‌కు మ‌ద్ద‌తుగా ఇంకో పిటిష‌న్‌
టార్గెట్ మోదీ...నోబెల్ విజేత క‌ల‌క‌లం రేపే వ్యాఖ్య‌లు
కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం...హైద‌రాబాద్‌లో ఆంధ్రుల‌కు షాక్‌?!
హైకోర్టు మెట్లెక్కిన తెలంగాణ గ‌వ‌ర్న‌ర్...ఆమెపై టార్గెట్‌
జీఎస్టీలో మ‌రిన్ని షాకులు...ఈ మీటింగ్ తేల్చేస్తుంద‌ట‌
మోదీ ఇలాకాలో మందు...మ‌హాత్ముడి హ‌త్య‌...ఏం జ‌రుగుతోంది
బీచ్‌లో బికినీ వేసుకున్నందుకు పోలీసుల‌ ఫైన్!
మోదీని ఉక్కిరిబిక్కిరి చేసేలా రాహుల్ ఎత్తులు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.