Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Oct 18, 2019 | Last Updated 10:41 pm IST

Menu &Sections

Search

కోడెల స్ధాయిని చంద్రబాబు దిగజార్చేశారా ?

కోడెల స్ధాయిని చంద్రబాబు దిగజార్చేశారా ?
కోడెల స్ధాయిని చంద్రబాబు దిగజార్చేశారా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్ధాయిని చంద్రబాబునాయుడు అండ్ కో పూర్తిగా దిగజార్చేశారు. తన నివాసంలోనే కోడెల ఆత్మహత్య చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అధికారంలో నుండి దిగిపోయిన తర్వాత కోడెలను చంద్రబాబు పూర్తిగా దూరం పెట్టేసిన విషయం తెలిసిందే. తెలుగుదేశంపార్టీ నుండి కోడెలను చంద్రబాబు దాదాపుగా వెలేసినంత పనిచేశారు.

 

అలాంటిది కోడెల ఆత్మహత్య చేసుకున్నారని తెలియగానే ప్రభుత్వమే హత్య చేసిందంటూ చంద్రబాబు శవరాజకీయం మొదలుపెట్టారు. ఎప్పుడైతే చంద్రబాబు నుండి ఆదేశాలు వచ్చాయో వెంటనే మొత్తం టిడిపి నేతలంతా కోడెల మృతికి ప్రభుత్వ వేధింపులే కారణమంటూ గగ్గోలు మొదలుపెట్టేశారు. నిజానికి కోడెల మీద ప్రభుత్వమేమీ తప్పుడు కేసులు పెట్టలేదన్న విషయం అందరికీ తెలుసు.

 

కోడెల మరణాన్ని ఎలాగైనా రాజకీయం చేసి లబ్ది పొందాలన్న చంద్రబాబు నీచ రాజకీయ ఎత్తుగడే ఇప్పుడు కూడా బయటపడింది. కోడెల మరణించిన తర్వాత చంద్రబాబు అండ్ కో ఆయనకు టిడిపితో ఉన్న అనుబంధం, ఆయన గొప్పతనం, డాక్టర్ గా ఆయన చేసిన సేవలు లాంటి విషయాలకే పరిమితమయ్యుంటే బాంగుండేది.

 

నిజానికి స్పీకర్ గా ఎంపికయ్యే వరకూ కోడెలపై అవినీతి పరుడనే ముద్రైతే లేదు. గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో ఫ్యాక్షనిస్టు అని మాత్రమే ప్రచారంలో ఉండేది. అలాంటిది స్పీకర్ అయిన తర్వాత కొడుకు శివరామకృష్ణ, కూతరు విజయలక్ష్మిల అరాచకాలకు కోడెల పూర్తి మద్దతు పలకటంతోనే అవినీతి మొదలైంది. దానికి అసెంబ్లీ ఫర్నీచర్ దొంగతనం కేసులో స్వయంగా సాక్ష్యాధారాలతో సహా దొరికిన తర్వాత కోడెలకున్న పరువంతా బజారునపడిపోయింది.

 

వాస్తవం ఇదైతే దాన్ని కప్పిపుచ్చుకునేందుకు కోడెల మరణాన్ని కూడా రాజకీయంగా ఉపయోగంచుకుంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బురద చల్లాలని చంద్రబాబు అండ్ కో ప్రయత్నించింది. దాంతో చంద్రబాబు ఆరోపణలను తిప్పికొట్టేందుకు మంత్రులు, వైపిపి నేతలు కోడెల అరాచకాలను, ఫర్నీచర్ దొంగతనాన్ని పదే పదే ప్రస్తావించాల్సొస్తోంది. అంటే కోడెలకున్న కాస్తో కూస్తో పరువును కూడా చంద్రబాబు దిగజార్చేసినట్లైంది. చంద్రబాబు నీచ రాజకీయాలకు కోడెల లాంటి సీనియర్ నేత బలైపోయారు.

 

 


naidu stooped down kodela image
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వెంకన్ననే దోచేసిన చంద్రబాబు
కేంద్ర జోక్యం మొదలైనట్లేనా ?..కెసియార్ కు గవర్నర్ షాక్
రాధాకృష్ణకు కోర్టు షాక్ ?
చంద్రబాబు హయాంలోనే అప్రకటిత ఎమర్జెన్సీ
జగన్ దృష్టంతా కోర్టు విచారణపైనే
చంద్రబాబు అయితే ఓకే..టిడిపి మాత్రం వద్దట
తోక ముడిచేశారా ? కోర్టు జోక్యమే కారణమా ?
ఇతర రాష్ట్రాల్లో కూడా పేరు మారుమోగిపోతోందిగా !
రాజధాని విషయంలో క్లారిటి వచ్చేసినట్లేనా ?
ఉద్యోగాల భర్తీలో తాజా సంచలనం
టిడిపి నేతలకు బిజెపి బంపర్ ఆఫర్
ఖాతాలో డబ్బు మిస్సైతే బ్యాంకే కట్టాలి..తెలుసా మీకు ?
మీడియా ’అతి’ కి స్పీడు బ్రేకులు..నిజంగా సిగ్గుపడాలి
తెలంగాణాలో జగనే లేటెస్ట్ సన్సేషన్..ఎంత క్రేజో తెలుసా ?
వైసిపికి విరాళాల వెల్లువ...ఎంతో తెలుసా ?
ఎంఎల్ఏ రాపాకకు ఇన్ని అవమానాలా ?
పథకాలకు నిధులు ఎక్కడి నుండి వస్తున్నాయో తెలుసా ?
జేసి బ్రదర్స్ కు షాక్
టిడిపిపై పోలీసు రివర్స్ ఎటాక్
10 పాస్ తో వేలాది ఉద్యోగాలు..కేంద్రం నోటిఫికేషన్
జగన్ పాలనతో సమాజానికి అరిష్టమా ?...మీరు అంగీకరిస్తారా ?
మహాత్ముడే సిగ్గు పడుతున్నాడు
జగన్ ప్రభుత్వానికి హై కోర్టు మద్దతు..చంద్రబాబుకు షాక్ ?
జగన్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్న ఎల్లోమీడియా
ఇందుకేనా అందరూ ప్యాకేజీ పవన్ అంటున్నది ?
చంద్రబాబుకు సొంత ఎంఎల్ఏ షాక్
కెసియార్ కు జగన్ షాక్
చేతులెత్తేసిన హై కోర్టు..ప్రభుత్వానికి సిగ్గు చేటే
సంచలనం : ఆర్టీసీ సమ్మె విషయంలో కెసియార్ కు టిఆర్ఎస్ ఎంపి షాక్
ప్రయాణీకులను పూర్తిగా దోచేస్తున్నారు
కెసియార్ తో పవన్ కు చెడిందా ?
పాలన...అంటే ఎలాగుండాలో చూపిస్తున్న జగన్
దసరా సెలవుల పొడిగింపు రహస్యం ఇదేనా ?
డేంజర్ జోన్ లో రాజధాని ప్రాంతం
చంద్రబాబులో పెరిగిపోతున్న కడుపుమంట
అడ్రస్ లేని తండ్రి, కొడుకులు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.