సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ లో జనసేన పార్టీకి ఉన్న అంతా సపోర్టు ఏ ఇతర పార్టీకి లేదన్నది జగమెరిగిన సత్యం. దాదాపుగా వారి పనితీరు అంతా సోషల్ మీడియాకు ఎక్కువగా ముడిపడి ఉంటుంది. అయితే అనూహ్య రీతిలో ఈరోజు ఉదయం ముందుగా జనసేనకు సంబంధించిన 4 ట్విట్టర్ హ్యాండిల్స్ సస్పెండ్ చేయడం జరిగింది. అది జనసేన కార్యకర్తలు ఆపరేట్ చేస్తున్న ప్రధాన అకౌంట్లు కావడం వల్ల పవన్ కళ్యాణ్ కు ఇది చాలా పెద్ద షాక్ అనే చెప్పాలి.

తర్వాత నిదానంగా ఒక్కొక్కటిగా సస్పెండ్ అవుతూ రాగా ఇప్పటికే ఆ సంఖ్య 50 కు చేరింది. ట్విట్టర్ మరియు ఫేస్ బుక్ అకౌంట్ల తో పాటు పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఫ్యాన్ క్లబ్స్ పై కూడా వేటు వేయడం జరిగింది. అయితే వీటన్నింటినీ ఎవరు సస్పెండ్ చేశారన్న విషయంపై ఇంకా ఎలాంటి నిర్ధారణ రాలేదు. ఈ విషయంపై ఇంకా జనసేన పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ స్పందించాల్సి ఉంది. వారి పార్టీకి సంబంధించి వస్తున్న ప్రతి అప్డేట్ మరియు అనౌన్స్మెంట్ లు అన్ని సోషల్ మీడియా ద్వారానే భారీ స్థాయిలో ప్రజలకు చేరువ అవుతాయి.

అయినా ఒక్కరోజులోనే 50కి పైగా ఫ్యాన్ క్లబ్ లు, ట్విట్టర్ హ్యాండిల్స్ మరియు ఫేస్ బుక్ అకౌంట్లు సస్పెండ్ అవ్వడం పై ఇప్పటికే చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఇప్పటికే సోషల్ మీడియా లో రచ్చ స్టార్ట్ కాగా.... ఇదంతా రాజకీయ కోణంలో జరిగిన కుట్ర అని కొందరు ఆరోపిస్తుండగా... మరి కొందరు దీనికి రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదని... అకౌంట్లలో వేసే పోస్టులు అభ్యంతరకరంగా ఉంటే ఆయా సోషల్ మీడియా వెబ్ సైట్ లు వాటిని తాత్కాలికంగా లేదా శాశ్వతంగా సస్పెండ్ చేస్తారు అని అంటున్నారు. ఇక దీనిపై జనసైనికులు ఎలా స్పందిస్తారు....ఈ విషయం ఎక్కడి వరకు వెళ్లి ముగుస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: