అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. మూడు దశాబ్దాలు తెలుగుదేశంపార్టీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకోవాలని కోడెల శివప్రసాదరావు ఎందుకు అనుకున్నారు ? ఎందుకంటే టిడిపిలో ఉండలేని పరిస్దితులు ఎదురవ్వబట్టే పార్టీ మారేందుకు ప్రయత్నించారనే ప్రచారం జరుగుతోంది.

 

నిజానికి పార్టీలో మొన్నటి వరకూ కోడెల తిరుగులేని నేత అనటంలో సందేహం లేదు. కానీ చంద్రబాబునాయుడు రాజకీయానికి ఎంతో సీనియర్ నేత అయిన కోడెల కూడా బలైపోయారనే టాక్ నడుస్తోంది. ముఖ్యంగా మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి తర్వాత తలెత్తిన పరిణామాలను కోడెల తట్టుకోలేకపోయారట.

 

టిడిపి అధికారంలో నుండి దిగిపోయిన తర్వాత కొడుకు శివరామకృష్ణ, కూతురు విజయలక్ష్మిలపై చెరో 25 కేసుల దాకా నమోదయ్యాయి. అధికారంలో ఉన్నపుడు కోడెల దృతరాష్ట్రునిగా మారిపోవటంతోనే సంతానం అరాచకాలకు అంతులేకుండా పోయింది. సంతానం చేస్తున్న ప్రతీ దురాగతం కోడెలకు తెలిసినా అడ్డుకోలేకపోయారట. అధికారంలో ఉన్నారు కాబట్టి ఎవరూ అడ్డుకోలేకపోయారు.

 

ఎప్పుడైతే ప్రతిపక్షంలోకి వచ్చారో అప్పటి నుండే కోడెల కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. కోడెల కుటుంబాన్ని సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో జనాలు చీదరించుకోవటం మొదలుపెట్టారు. అదే సమయంలో కేసులు నమోదవ్వటం, పార్టీ నేతలు దూరంగా జరగటం, చంద్రబాబు కూడా మాట్లాడేందుకు ఇష్టపడకపోవటం లాంటివి కోడెలను బాగా మనస్ధాపానికి గురిచేశాయని సమాచారం.

 

ఇంట, బయట ఎదురవుతున్న నిరాధరణ, వ్యతిరేకత కారణంగా టిడిపిలో నుండి బయటపడితేనే బాగుంటుందని కోడెల అనుకున్నారట. అదే విషయాన్ని ఫైనల్ గా చంద్రబాబుతో చెప్పేద్దామని కోడెల  ప్రయత్నించినా సాధ్యం కాలేదని సమాచారం. కోడెలతో మాట్లాడేందుకు చంద్రబాబు ఇష్టపడలేదట.  దాంతో కొడుకు కూడా టిడిపికి రాజీనామ చేసేసి వేరే పార్టీలోకి వెళ్ళిపోదామని పోరు మొదలుపెట్టాడట.

 

ఇందులో భాగంగానే కోడెల బిజెపి నేతలతో మాట్లాడారట. అయితే జనాల్లో భ్రష్టుపట్టిపోయిన కోడెల లాంటి వ్యక్తులను చేర్చుకుంటే ఇబ్బందులు వస్తాయని బిజెపిలోనీ కీలక నేతలు అడ్డుపడ్డారట. దాంతో టిడిపిలో ఉండలేక బయటపడలేక మనస్ధాపం పెరిగిపోయి చివరకు బలవన్మరణానికి పాల్పడ్డారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: