తెలంగాణ కొత్త గవర్నర్ గా తాజాగా పదవీ బాధ్యతలు చేపట్టిన తమిళసై  సౌందర్య రాజన్  యాక్షన్ షురూ చేశారు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సెక్రటేరియట్ లో ఉండటం లేదని కేవలం ఫాంహౌస్లో,  రాజ్ భవన్ లో మాత్రమే ఉంటున్నారని... ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని ఆమె దృష్టికి రావడంతో ప్రజా దర్బార్ నిర్వహించేందుకు సిద్ధ అయ్యారు.ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు గవర్నర్ . ప్రభుత్వ వివిధ శాఖల పై సమీక్షలు నిర్వహించి నివేదిక తయారు చెయాలని  గవర్నర్ తమిళసై  సౌందర్య రాజన్  నిర్ణయించినట్లు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో మంత్రులందరూ తమ తమ శాఖలకు సంబంధించిన కీలక సమాచారాన్ని అందించాల్సిందిగా  అధికారులకు ఆదేశాలు ఇచ్చారట.  అయితే రాష్ట్రంలో విషజ్వరాల బెడద ఎక్కువగా ఉన్నందున మొదటగా వైద్య శాఖ పై గవర్నర్ సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. విష జ్వరాల బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య, విషజ్వరాల బాధితుల వివరాలు అందించాలని గవర్నర్ ఇప్పటికే  అధికారులను ఆదేశించినట్టు సమాచారం. ఆ తర్వాత విద్యా శాఖకు సంబంధించి ఇంటర్మీడియట్ ఫలితాల్లో తప్పులు దొర్లడం అవకతవకలు వంటి అంశాలు... ఫలితాలు అవకతవకల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల వివరాలు  గవర్నర్ తమిళసై  సౌందర్య రాజన్ అధికారులను కోరినట్టు తెలుస్తుంది. 

 

 

 కాగా ప్రభుత్వ శాఖలకు సంబంధించి గవర్నర్ తమిళ సై  సౌందర్య రాజన్ ఎప్పుడు సమీక్ష నిర్వహించిన పూర్తి సమాచారంతో సమీక్షకు హాజరవడానికి మంత్రులు  సంసిద్ధమవుతున్నారు. కాక గవర్నర్ త్వరలోనే పోలీస్ శాఖ పై సమీక్ష నిర్వహించే అవకాశం ఉందని హోం మంత్రి మహమ్మద్ సూచనలు ఇవ్వగా ఈ సమీక్ష అనంతరం తయారు చేసిన నివేదికను గవర్నర్ తమిళసై  సౌందర్య రాజన్ కేంద్రానికి నివేదిక పంపిస్తారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: