హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగా  ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన గజ్జలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా నేడు  విడుదల హిట్ టాక్ తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా ప్రారంభించినప్పటి నుంచి ఈ సినిమాని  వివాదాలు చుట్టుముట్టాయి. అయితే ఈ వివాదాలను చిత్రబృందం పట్టించుకోలేదు. కొన్ని జిల్లాల్లో చిత్రాన్ని బ్యాన్ చేస్తామని చెప్పడంతో చిత్ర బృందం సినిమా టైటిల్ ని గద్దలకొండ  గణేష్ గా మార్చిన విషయం తెలిసిందే. అయితే కొన్ని గంటల ముందు సినిమా టైటిల్ మారిస్తే సినిమా పై ఏమైనా ప్రభావం చూపుతుందని అందరూ అనుకున్నారు. కానీ సినిమాలో మంచి యాక్టింగ్,  మంచి కంటెంట్ ఉంటే సినిమా టైటిల్ ఏమి అవసరం అంటూ ఈ సినిమా ఫ్రూవ్ చేసింది . 

 

 

 అయితే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఫిదా, తొలిప్రేమ అంటూ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు . అయితే గజ్జలకొండ గణేష్ సినిమాకి మాత్రం వరుణ్ తేజ్  స్పెషల్ లుక్ తో చాలా డిఫెరెంట్  కనిపించాడు. వరుణ్ లుక్ తోనే ఈ సినిమాకి ఎంతో క్రేజ్ సంపాదించాడు. అయితే ఈ సినిమాలో వరుణ్ చేసిన  మాస్ యాక్టింగ్ చూస్తే ఫిదా అవ్వకుండా ఉండలేరు. ఇప్పుడివరకు వరుణ్ కెరీర్లో మంచి హిట్లు ఉన్నప్పటికీ... గద్దల కొండ గణేష్ వాల్మీకి మాత్రం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరియర్లోనే ది  బెస్ట్ మూవీ గా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో వరుణ్ లుక్, యాక్టింగ్,  కామెడీ టైమింగ్ అన్ని పీక్స్ లో ఉన్నాయి. ఇక పూజహిగ్డే అందం ఎక్కడ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా సినిమాకి కరెక్ట్ గా సరిపోయింది. దర్శకుడు హరీష్ శంకర్ వరుణ్ తేజ్ ని మాస్ హీరోల చూపెట్టడంలో  సక్సెస్ సాధించడనే  చెప్పాలి. అయితే  హిట్ టాక్ తో దూసుకుపోతున్న గజ్జలకొండ గణేష్ సినిమా... వరుణ్తేజ్ కెరియర్ లోనే ది బెస్ట్ హిట్టవుతుందని అందరూ భావిస్తున్నారు. చూడాలి మరి గద్దల కొండ గణేష్ బాక్సాఫీస్ దగ్గర ఎన్ని రికార్డులు బద్దలుకొడుతున్న.

మరింత సమాచారం తెలుసుకోండి: