ఏపీలో ఇపుడు మరో మారు అమరావతి రాజధాని విషయంలో చర్చ సాగుతోంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని ఘటనల మూలంగా మరుగున పడిన అమరావతి రాజధాని మరోమరు తెరపైకి వస్తోంది. దీనికి సంబంధించి జగన్ ఇప్పటికే నిపుణుల కమిటీని  ఎంపిక చేసి మరీ నియమించారు. ఏపీ వ్యాప్తంగా అభివ్రుధ్ధి సమగ్రంగా ఎలా చేయాలన్నది ఆ కమిటీ వివరిస్తుంది. అదే సమయంలో అమరావతి లో కూడా ఎంత మేరకు అభివ్రుధ్ధికి అవకాశం ఉందన్నది కూడా కమిటీ చెబుతుంది.


కమిటీ నివేదిక ఎలా ఉన్నా కూడా జగన్ మదిలో కొన్ని కచ్చిమైన అభిప్రాయాలు అమరావతి రాజధాని మీద ఉన్నాయి. ఆయన చంద్రబాబు మాదిరిగా తొమ్మిది నగరాలను మాత్రం లావిష్ గా నిర్మించే ప్రసక్తే లేదని అంటున్నారు. అలాగే సింగపూర్ ప్లాన్ కి కూడా నో చెప్పేయడం ఖాయం. అలాగే బాహుబలి సెట్టింగులు కూడా ఉండవు. మరి అమరావతి ఎలా ఉంటుంది అంటే అభివ్రుధ్ధి వికేంద్రీకరణ దిశగా అమరావతి ఉంటుందని చెప్పాలి.


వెలగపూడిలో సెక్రటేరియట్, అసెంబ్లీ ఉంటాయి. నేలపాడులో హైకోర్టు ఉంటుంది, అదే విధంగా రాజ్ భవన్ విజయవాడలో ఉంటుంది. ఇక చంద్రబాబు ఏవైతే టెంపరరీ బిల్డింగులు అంటూ కట్టారో వాటినే మరిన్ని హంగులు సమకూర్చి పర్మనెంట్ బిల్డింగులుగా మార్చాలని జగన్ భావిస్తున్నారని టాక్.  ఇక మిగిలిన ప్రాంతాలలో కూడా అభివ్రుధ్ధికి జగన్ ప్రణాళికలు రూపొందించుకున్నారు. రైతుల విషయానికి వస్తే వారికి న్యాయం జరిగేలా చూడాలన్నది కూడా ప్రభుత్వం ఆలోచనగా ఉంది. రోడ్లు,డ్రైనేజీల వంటివి రైతుల ప్లాట్లలో డెవలప్ చేయడం, ఇటు ఎమ్మెల్యేలు, ఐఏఎస్ అధికారుల నివాస భవనాలు, ఇతర అధికారుల భవనాలు కట్టడం ద్వారా రైతుల భూములకు భారీగా ధరలు పెరిగేలా చూడాలన్నది జగన్ ఆలోచనగా ఉంది. 


మొత్తానికి వైసీపీ సర్కార్ అనుకుంటున్నట్లుగా అమరావతికి ఒక షేప్ ఈ పాలనాకాలంలోనే తీసుకురావాలనుకుంటోంది.  అందుకోసం 16, 500 కోట్ల వరకూ ఖర్చు అవుతుందని లెక్క వేస్తున్నారు. కేంద్రం మొత్తం మీద 2,500 కోట్లకు మించి నిధులు ఇవ్వమని తేల్చేసింది. అందులో 1600 కోట్లు ఇప్పటికే  రిలీజ్ చేశారు కూడా. అంటే అమరావతి ఖర్చు అంతా ఇపుడు వైసీపీ సర్కార్ భరించాల్సివుంటుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: