నెల్లూరు మరియు తిరుపతి సహా రాయలసీమ ప్రాంత విద్యార్థులు ఎందరికో విద్యాబుద్ధులు నేర్పించి వారిని సభ్య సమాజంలో మంచి స్థాయిలో నిలబెట్టిన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ సిబ్బంది, పది రోజుల క్రితం ఒక వికలాంగునిపై జాలి, కరుణ లేకుండా అతడిని ఒక గదిలో నిర్బంధించి, రిజిస్ట్రార్, ఇంచార్జి రిజిస్ట్రార్ సహా మరికొంతమంది అధ్యాపకులు కలిసి అతడిని పలు రకాలుగా చిత్రహింసలు పెట్టిన ఘటనను ఎప్పటికీ మరచిపోలేము అనే చెప్పాలి. ఆ ఘటన జరిగి పదిరోజులు గడిచినా, ఇప్పటికి కూడా దానిపై తమ సమాధానం ఇవ్వడానికి సదరు విశ్వవిద్యాలయ సిబ్బంది ముందుకు రాకపోవడం సిగ్గుచేటని అంటున్నారు అక్కడి కొందరు విద్యార్థులు. 

సాంకేతిక విభాగంలో పనిచేసే వికలాంగుడైన వ్యక్తి ఒకరు, పెండింగ్ బిల్లుల విషయమై విశ్వవిద్యాలయ సిబ్బంది యొక్క సమాచారం కోసం వెళ్లగా, అతడిని ఒక గదిలో పెట్టి దాదాపుగా గంటసేపటికి పైగా నిర్బంధించి, దూషించి, ఆఖరుకి అతడితో బలవంతంగా కొన్ని సంతకాలు తీసుకున్నారు. అతడు ఎంత బ్రతిమిలాడినప్పటికీ కూడా ఏ మాత్రం కనికరం చూపని సిబ్బంది పై సర్వత్రా విమర్శలు విపరీతంగా పెరుగుతున్నాయి. పార్టీలు ఎన్ని మారినప్పటికీ ఇటువంటి యూనివర్శిటీల్లో, అలానే ఆయా సిబ్బంది వ్యవహార శైలిలో మార్పు రావడం లేదని, అలానే ఇక్కడ జరిగే అసాంఘిక చర్యలు, లైంగిక వేధింపులు రోజురోజుకు పెరుగుతున్ననేపధ్యంలో, 

వాటికి పాల్పడుతున్న వారిపై సరైన చర్య తీసుకునే వారు లేకపోవడం ఎంతో దౌర్భాగ్యం అంటున్నారు పలువురు ప్రజలు మరియు సామజిక సంఘాల వారు. ఎంతో బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న రిజిస్ట్రార్ వంటి వారే ఈ విధంగా అన్యాయంగా తప్పుడు పద్ధతుల్లో పయనిస్తే, విద్యావ్యవస్థపై యువతకు ఏ విధంగా నమ్మకం ఏర్పడుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇకనైనా ప్రస్తత ప్రభుత్వం, వికలాంగ సోదరునిపై దయ, కనికరం లేకుండా దాడి చేసిన విశ్వవిద్యాలయ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు........!!


మరింత సమాచారం తెలుసుకోండి: