ప్రాజెక్టుల నాణ్యత గురించి తెలుగుదేశంపార్టీ కూడా మాట్లాడేస్తోంది. నిజానికి నాణ్యత గురించి మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబునాయుడుకు కానీ టిడిపి నేతలకు కానీ లేదుగాక లేదు. తన హయాంలో నిర్మించిన ప్రపంచస్ధాయి రాజధాని నిర్మాణాల్లో నాణ్యత ఎంతో జనాలందరికీ బాగా అర్దమైపోయింది. చిన్నపాటి వర్షాలకు కూడా భవనాల్లో బ్రహ్మాండంగా లీకేజీలవుతున్న విషయం అందరూ చూస్తున్నదే.

 

వందల కోట్ల రూపాయల్లో పూర్తయ్యే నిర్మాణాలను వేల కోట్ల రూపాయలకు పెంచేసి భారీగా ప్రజాధనాన్ని దోచేసుకున్న చంద్రబాబు అండ్ కో కూడా ఇపుడు జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలపై ఆరోపణలు చేసేస్తున్నారు. ముందు రివర్స్ టెండరింగ్ పద్దతే పనికిమాలిన వ్యవహారమని ఆరోపించారు. దాని వల్ల సమయం వృధా అవటం తప్ప మరో ఉపయోగమే లేదని మండిపోయారు. తాము చెప్పటమే కాకుండా ఎల్లోమీడియాలో కథనాలు కూడా రాయించారు.

 

సరే ఎవరు ఏమనుకున్నా పర్వాలేదన్నట్లుగా జగన్ రివర్స్ టెండరింగ్ పద్దతిలో ముందుకెళ్ళిపోయారు. ఇప్పటికి రెండు ప్రాజెక్టుల్లో రివర్స్ టెండర్లు పూర్తయ్యాయి. ఈ రెండు ప్రాజెక్టుల్లోనే ప్రభుత్వానికి సుమారు 730 కోట్ల రూపాయలు మిగిలాయి. ప్రభుత్వానికి మిగిలాయంటే చంద్రబాబు హయాంలో అంతే మొత్తానికి అవినీతికి పాల్పడినట్లే లెక్క.

 

ఎప్పుడైతే రివర్స్ టెండర్లకు మంచి ఫలితాలు వస్తున్నాయో వెంటనే టిడిపి ప్లేటు ఫిరాయించేసింది. తక్కువ ధరలకే ప్రాజెక్టులను కట్టబెట్టేస్తుంటే వాటి నాణ్యత ఏమవ్వాలంటూ తెగ బాధపడిపోతున్నారు టిడిపి నేతలు. తక్కువ ధరలకే ప్రాజెక్టులు కడుతున్నామని చెప్పారంటే నాణ్యత విషయంలో కచ్చితంగా అనుమానించాల్సిందే అంటూ పనికిమాలిన లాజిక్కులు తెస్తున్నారు.

 

పోలవరం ప్రాజెక్టును దక్కించుకున్న మేఘా కంపెనీకి మంచి ట్రాక్ రికార్డే ఉంది. పైగా తెలంగాణాలో ఈమధ్యే కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేసిన ఘన చరిత్ర కూడా మేఘా సొంతం. అయినా చిన్నపాటి వర్షాలకు కూడా జోరుగా కురుసేటువంటి తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ, హై కోర్టును నిర్మించిన చంద్రబాబు కూడా నాణ్యత ప్రమాణాల గురించి మాట్లాడితే పట్టించుకునే వాళ్ళెవరు లేండి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: