గత కొంత కాలంగా ఏపిలో పోలవరం పై ఎన్నో సంచలనాత్మక కథనాలు వస్తున్నాయి.  అయితే గతంలో టీడీపీ పాలనలో పోలవరం పనులు పూర్తి కాలేదు కదా..దుబారా ఖర్చులు బాగా అయ్యాయని అధికార పార్టీ నిలదీస్తుంది. మరోవైపు పోలవరాన్ని మా పరిధిమేరకు నిర్మిస్తూ వచ్చామని ప్రతిపక్ష పార్టీ అంటుంది.  అయితే పోలవరం విషయంలో టీడీపీ తమ తప్పులు దాచిపెడుతూ..తమ బండారం ఎక్కడ బయట పడుతుందో అని భయపడుతున్నారని అంటున్నారు అధికార పార్టీ సభ్యులు. తాజాగా పోలవరం విషయంలో ఏర్పాటు చేసి ఓ కార్యక్రమంలో మంత్రి అనీల్ కుమార్ యాదవ్ ప్రతిపక్షం పై నిప్పుల వర్షం కురిపించారు. 

రివర్స్‌ టెండరింగ్‌ ఓ సాహాసోపేత నిర్ణయం.రివర్స్‌ టెండరింగ్‌ ను ప్రవేశపెట్టిన ఘనత శ్రీ వైయస్‌ జగన్‌ దే. –4,987 కోట్ల రూపాయలు ఉండే టెండర్‌ 4,359 కోట్లకు వచ్చింది.  రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రాష్ట్రానికి వేల కోట్లు ఆదా చేస్తూ పారదర్శకంగా వెళ్తుంటే తమ దోపిడీ బండారం బయటపడిపోతుంది అని టిడిపి నేతలు బయపడుతున్నారు. పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ ఒక చరిత్ర.దీనివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. పోలవరం హెడ్‌ వర్క్స్‌ కు సంబంధించి రివర్స్‌ టెండరింగ్‌ లో 800 కోట్ల ప్రజాధనం ఆదాఅయిందని అన్నారు. అందుకే టిడిపి,చంద్రబాబు శ్రీ వైయస్‌ జగన్‌ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు.


మేఘా 12.6 శాతం తక్కువకు పనులు చేస్తామని ముందుకు వస్తే దానిపై కూడా నానా యాగి చేస్తున్నారు. ఇదే మేఘా సంస్దకు మీ హయాంలో 20 వేల కోట్లమేర కాంట్రాక్ట్‌ లు ఇచ్చారు.నాణ్యతపై విమర్శలు చేస్తున్నారు.ఇంత ప్రముఖ సంస్ద నాణ్యత పాటించదని చెప్పడం సరికాదు. పారదర్శక బిడ్డింగ్‌ పై విమర్శలు సరికాదు. పోలవరం ఆగిపోయింది,నష్టం వచ్చిందని రకరకాలుగా మాట్లాడుతున్నారు.వీటన్నింటిని జీర్ణించుకోలేక ప్రభుత్వంపై బురద చల్లాలనే ప్రయత్నం చేస్తున్నారు.


 పోలవరంను మీరు చెప్పిందానికన్నా ముందే మేం పూర్తి చేస్తే రాజకీయసన్యాసం తీసుకుంటారా? మీ పార్టీని (టిడిపిని)పూర్తిగా మూసివేస్తారా?  పోలవరమే కాదు వెలిగొండకు కూడా రివర్స్‌ టెండరింగ్‌ కు వెళ్తాం. మీరు ఇచ్చిన ప్రతి పని గురించి రివర్స్‌ టెండరింగ్‌ కు వెళ్తాం.వేల కోట్ల రూపాయలు ఆదా దిశగా ముందుకు వెళ్తాం. మీరు ఎక్సెస్‌ ఇచ్చిన టెండర్ల ద్వారా దోపిడీ చేసిన మొత్తం పెదబాబు లేదా చినబాబు జేబులోకి వెళ్లాయా?మరెవరిజేబుల్లోకి వెళ్లాయి. ప్రభుత్వానికి అవసరమైనవారికి కట్టబెట్టారని విమర్శిస్తున్నారు.10 నుంచి 20 శాతం వరకు లెస్‌ కు టెండర్‌ వేస్తే వాటిని కట్టబెట్టడం అంటారా ?


 
మీకు ప్రెస్‌ మీట్‌ పెట్టి మాట్లాడుతున్న స్దలం కూడా సంవత్సరానికి వేయి రూపాయలకు లీజుకు తీసుకున్నారు.ఇంకా మీరు నీతి నిజాయితీ అని మాట్లాడతారా? మీకు సిగ్గుంటే ఆ స్దలాన్ని ఖాళీ చేసి మాట్లాడండి. ఇరిగేషన్‌ డిపార్ట్‌ మెంట్‌ పై జగన్‌ మోహన్‌ రెడ్డి దాడి చేస్తున్నారంటావా?  మీరు ఇచ్చిన టెండర్లన్నీ ఎక్సెసే.మేం లెస్‌ కు టెండర్లు ఇస్తున్నాం. దీనివల్ల 830 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం ఉంది.రివర్స్‌ టెండరింగ్‌ కు వెళ్లకపోతే ఇన్ని కోట్ల రూపాయలు చంద్రబాబు ఆయన వందిమాగధుల చేతిలోకి వెళ్లిఉండేవి.


నవయుగవాళ్లు కావాలనుకుంట బిడ్‌ లో పాల్గొనవచ్చుకదా మేం వద్దనలేదే.వాళ్లు నామినేషన్‌ లో అయితే ముందుకు వస్తారు.కాని బిడ్డింగ్‌ లో అయితే పాల్గొన్నారు.  శ్రీ వైయస్‌ జగన్‌  గారి ప్రభుత్వం ఇది భారతదేశంలోనే ఒక చరిత్ర.వేల కోట్ల రూపాయలను ప్రభుత్వ ఖజానాకు మిగులుస్తున్నారు.ఇదే రీతిలో అన్ని ప్రాజెక్ట్‌ లలో ముందుకు వెళ్తాం. రెండు సంవత్సరాలలో పోలవరం నిర్మాణం పూర్తి చేస్తాం. చంద్రబాబు,టిడిపి ఎల్లోమీడియా విషప్రచారాలను నమ్మవద్దు. టెండరింగ్‌ లో పారదర్శకతే మా ప్రభుత్వం లక్ష్యం అని అన్నారు మంత్రి అనీల్ కుమార్ యాదవ్.


మరింత సమాచారం తెలుసుకోండి: