ముఖ్యమంత్రి జగన్ మీద ఏదో రకంగా బురద జల్లాలని చూస్తున్న ఏపీ ప్రతిపక్షానికి ఎల్లో మీడియా సాయం బాగానే దొరుకుతోంది. దాంతో ఉన్నవీ లేనివీ కలిపి రాతలు రాసేస్తున్నారు. వండి వార్చిన కధనాలను అవే అసలైన  నిజాలుగా నమ్మమంటున్నారు. గోదావరి క్రిష్ణా నదుల అనుసంధానం గురించి జగన్ కేసీయార్ భేటీ ప్రధానంగా జరిగింది.  విషయం ఇంత క్లియర్ గా ఉంటే ఎల్లో మీడియా పెట్టిన హెడ్డింగులు చూస్తే మతి పోయేలా ఉన్నాయని అంటున్నారు.


బీజేపీ మీద పోరాడేందుకు ఇద్దరు సీఎం లు రెడీ అంటూ ఎల్లో మీడియా కమలనాధులను రెచ్చగొట్టేలా హెడ్డింగులు పెట్టడం విశేషం. పూర్తిగా కేంద్రం మీద ఇద్దరు సీఎం లు అసంత్రుప్తి వ్యక్తం చేశారని, రానున్న రోజుల్లో ఉమ్మడిగా కేంద్రంపైన పోరాడాలని నిర్ణయించారని రాసుకొచ్చిన రాతలు ఏ ప్రయోజనాల‌ కోసమో వేరేగా చెప్పనక్కరలేదు. ఈ విధంగా బీజేపీని కిర్రెక్కించాలన్న ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది.


ఇక కేంద్రంలో మోడీకి జగన్ కి మధ్య లడాయి పెడితే తమ పని సులువు అవుతుందనుకున్న మాస్టర్ మైండ్ గేం గానే దీన్ని చూడాలని అంటున్నారు.  నిజానికి జగన్ కి  బీజేపీతో మంచి సంబంధాలే ఉన్నాయి. ఒకవేళ కొన్ని విషయాల్లో  ఇబ్బందులు ఉన్నా కూడా ఇపుడు ఉన్న ఏపీ పరిస్థితుల ద్రుష్ట్యా వివాదాల జోలికి జగన్ పోదలచుకోలేదన్నది నాలుగు నెలల ఆయన రాజకీయం చూస్తే అర్ధమవుతుంది.


ఇక జగన్ తాను అమలుచేస్తున్న వైఎస్సార్ రైతు భరోసా, ఇతర సంక్షేమ పధకాల ప్రారంభం కోసం ఏకంగా దేశ ప్రధాని మోడీని పిలుస్తున్నారు. వచ్చే నెలలో ఏపీలో ప్రధాని మోడీ పర్యటన కూడా ఉంది. అదే సమయంలో జగన్ తరచూ ఢిల్లీ వెళ్ళి మోడీకి ఏపీ విషయాలన్నీ పూసగుచ్చినట్లుగా చెబుతూనే ఉన్నారు. మరో వైపు కేంద్రంలోని బీజేపీకి ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎంతగా ఎదగాలని ఉన్నా కూడా కసీయార్, జగన్ని దూరం చేసుకునే ఆలోచన ఏదీ లేదన్నది అందరికీ తెలిసిందే


.
చంద్రబాబు కంటే నమ్మకమైన పార్టనర్స్ ఈ ఇద్దరు అన్నది మోడీ షాలకు తెలియనిది కాదు, మొత్తానికి చూసుకుంటే మాత్రం మోడీతో యుధ్ధానికి జగన్ని రెడీ చేయాలనుకుంటున్నా అక్కడ అంత సీన్ లేదని తెల్సీపోతోంది. ఇలాంటి రాతల పట్ల ఏపీ సీఎంఓ  ఆఫీస్ కూడా ఖండనలు ఇచ్చేసింది. అయినా సరే  మా రాతలు మావేనంటే మాత్రం ఆ ఆనందం వారిది. దూరం చేయడమెందుకంటున్నారు వైసీపీ నేతలు.


మరింత సమాచారం తెలుసుకోండి: