ఉల్లి రేటు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో ఉల్లి వైపు చూడాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఉల్లిపాయలు కొస్తే కన్నీళ్లు రావటం కామన్ కానీ... ప్రస్తుతం ఉన్న ఉల్లి రేట్లు చూస్తే కోయకుండానే కన్నీళ్లు వస్తున్నాయి. అవును మరి ఉల్లి రేట్లు చూస్తే కన్నీళ్లు రాకుండా ఉంటాయా. ఉల్లి రేట్లు ఆకాశాన్నంటుతున్న తరుణంలో...ఉల్లి రైతుల మోకాల్లో ఆనందం వెళ్లి  విరుస్తుంది. ఢిల్లీలో 70 నుండి 80 రూపాయల వరకు పలుకుతుంది ఉల్లి ధర . అయితే మొన్నటి వరకు విలువైన వస్తువులను దొంగలించేందుకు ప్రయత్నించిన దొంగలు... ఇప్పుడు మాత్రం ఉల్లిని దొంగలించేందుకు సిద్ధం అవుతున్నారు . 

 

 

 వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇక్కడ జరిగిన సంఘటన చూస్తే నిజమే అనిపిస్తుంది మరి. ఉల్లి ధర పెరగడంతో వాటిని అమ్మి సొమ్ము చేసుకుందామని అనుకున్నాడో రైతు. దానికోసం భారీ మొత్తంలో తన ఇంట్లో ఉల్లిపాయలను నిలువ చేశాడు కూడా. అయితే పొలానికి  వెళ్లి వచ్చి  చూసేసరికి ఇంటి  తలుపులు తెరిచి ఉన్నాయి. దీంతో షాక్ కి గురైన రైతు లోపలికి వెళ్లి చూడగా అక్కడ నిల్వ  ఉన్న ఉల్లి మొత్తం ఖాళీ అయిపోయింది. దీంతో  లబోదిబో మన్నాడు ఆ రైతు. ఏకంగా ఒక లక్ష రూపాయల ఉల్లిని దొంగలు చోరీ చేశారు.

 

ఈ ఘటన  మహారాష్ట్రలోని కల్వాన్ లో జరిగింది. రైతు రాహుల్ బాజీరావు తన  ఇంటిని స్టోర్ రూమ్ గా మార్చుకొని ఉల్లిపాయ జాగ్రత్తగా దాచుకున్నాడు. అయితే రోజూ మాదిరిగానే రాహుల్ బాజీరావ్ పొలానికి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. దీంతో లోపలికి వెళ్లి చూసిన రైతు కి ఉల్లిపాయలు దొంగతనం జరిగాయని అర్థమైంది.దీంతో షాక్ కి గురైన రైతు తేరుకుని  దీనిపై పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా... అక్కడ పోలీసులు కూడా అవాక్కయ్యారు. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఉల్లి  దొంగలను పట్టుకుని పనిలో పడ్డారు. కానీ ఉల్లి ధరలు  ఆకాశాన్నంటుతున్న తరుణంలో  దొంగలు ఇప్పటికే ఉల్లిని అమ్మేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఏదేమైనా ఉల్లి  దొంగతనం జరగడం కలకలం రేపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: