ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రజా నాయకుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పడి  నుంచి ఎన్నో కీలక పథకాలను ప్రవేశపెడుతూ ... పాలనలో తనదైన ముద్ర వేసుకుంటూ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారు జగన్. అధికారంలోకి వచ్చినప్పటినుంచి పారదర్శకంగా పాలన సాగిస్తూ ప్రజలందరికీ సమన్యాయం చేస్తూ ముందుకు సాగుతున్నాడు ముఖ్యమంత్రి జగన్. అయితే వైసీపీ పార్టీ స్థాపించినప్పటి నుంచి తనకు వెన్నంటే ఉన్న అందరూ నేతలకు కీలక పదవులు కట్టబెడుతున్నారు జగన్. అయితే ఈ నేపథ్యంలోనే పలువురు మహిళా వైసీపీ నేతలకు కీలక పదవులు కట్టబెట్టిన  జగన్... జగన్ సోదరి వైఎస్ షర్మిల కి లక్ష్మీపార్వతి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి పదవి కేటాయించలేదు. 

 

 

 అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం వైయస్ షర్మిల కు కీలక పదవి కట్టబెట్టడం కాయం  అన్నట్లు తెలిసింది. జగన్ కి అనునిత్యం అండగా ఉంటూ వైసీపీ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే ముఖ్య నేతగా షర్మిల ఉన్నారు. అయితే జగన్ జైలులో ఉన్నప్పుడు ఆమె సోదరి షర్మిల జగన్ కు బదులుగా పాదయాత్రలో పాల్గొని ప్రజల ఆశీస్సులు పొందారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా షర్మిల ముఖ్య పాత్ర పోషించారు.అయితే కొన్ని రోజులుగా జగన్ సోదరి షర్మిలకు కీలక పదవి కట్టబెట్టనున్నట్లు  వార్తలు వస్తున్నాయి. 

 

 

 అయితే షర్మిలకు పార్టీలో కీలక పదవి ఇస్తారని  వైసిపి వర్గాల్లో టాక్ నడుస్తోంది. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎంతో కృషి చేసిన... పార్టీ వ్యవహారాల్లో ముఖ్య కార్యకర్తగా  వ్యవహరించిన షర్మిల... అప్పటి సీఎం చంద్రబాబు పై నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షర్మిల కి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పదవీ బాధ్యతలు అప్పగించేందుకు వైసీపీ పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు షర్మిలకు  ఎలాంటి కీలక పదవి అప్పజెప్పని  జగన్... పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా షర్మిలను నియమిస్తారనే  ప్రచారం కూడా వైసిపి వర్గాలు నడుస్తుంది. ఓవైపు సీఎంగా,  మరోవైపు పార్టీ అధ్యక్షుడిగా  వ్యవహరిస్తున్న జగన్... వైసిపి పార్టీ వ్యవహారాలు తన సోదరి షర్మిలకు అప్పజెప్పి అవకాశం ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: