హైదరాబాద్‌ హుస్సేన్‌ సాగర్‌ వర్షపు నీరుతో నిండుకుండలా మారింది. నీటితో కళకళలాడుతోంది. కొన్ని రోజుల నుంచి నగర పరిసరాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వచ్చి చేరుతున్న వరదతో హుస్సేన్‌ సాగర్‌ జలాశయాన్ని తలపిస్తోంది. ఇంకా ఈరోజు వర్షం నీరుతో సాగర్‌లో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. హుస్సేన్‌ సాగర్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 513 మీటర్లు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 513.70 మీటర్లకు చేరింది.                          


అయితే ప్రస్తుత హుస్సేన్‌ సాగర్‌ నీటి మట్టంతో పెద్దగా ప్రమాదం లేదని జిహెచ్‌ఎంసి అధికారులు ప్రకటించారు. కానీ ప్రజలు తీవ్రంగా భయపడుతున్నారు. ఒకే నెలలో ఇలా నీరు నిండటం ఇది రెండోసారి. సరిగ్గా వినాయక చవితి సమయంలోను ఇలానే హుస్సేన్ సాగర్ నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. అయితే అప్పుడే నీటిని తరలించడానికి ఏ క్షణమైనా గేట్లు ఎత్తి వేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వార్తలు వచ్చాయి.                           


 కానీ వినాయకుడి నిమర్జనలు కూడా హుస్సేన్ సాగర్ వడ ప్రశాంతంగా జరిగాయి. మొదట నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడం వల్ల అడ్డంకులు ఉండచ్చు అని అనుకున్న అలాంటి అడ్డంకులు ఏమి జరగకుండా ప్రశాంతంగా వినాయకుడి నిమర్జనం గడిచింది. ఏది ఏమైనా 111 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ లో ఇంతటి భారీ వర్షాలు పడ్డాయి.                                 


మరింత సమాచారం తెలుసుకోండి: