ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ మృతిచెందిన సంగతి తెలిసిందే. 1979లో తెలంగాణ‌లోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో జన్మించిన వేణుమాధవ్ చిన్న వయసులోనే మిమిక్రి ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. 1997లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన 'సంప్రదాయం' చిత్రంతో వెండి తెర‌కు ప‌రిచ‌యం అయ్యారు. సినిమాలో వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని కమెడియన్ గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు.                        


వెండి తెరపై కామెడీ చేస్తూ ప్రేక్షకుల ముఖాల్లో నవ్వులు పూయించిన అతని జీవితంలో మాత్రం చివరి సమయంలో విషాదం నింపింది. అనారోగ్యం కారణంగా గత కొన్ని సంవత్సరాల నుంచి సినిమాలకు దూరంగా ఉన్నాడు వేణుమాధవ్. సరిగ్గా నాలుగు సంవత్సరాలుగా వేణు మాధవ్ లివర్ సంబంధిత వ్యాధితో భాదపడుతున్నారు. కానీ పరిశ్రమలో ఈ విషయం ఎవరికీ తెలియదు.                               


ఆ వ్యాధి రోజురోజుకు తీవ్రమై వేణుమాధవ్ ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేసింది. ఆ సమయంలోనే సరిగ్గా కిడ్నీల వ్యాధి కూడా వచ్చింది. దీంతో వేణు మాధవ ఆరోగ్యం మరింత క్షిణించింది. వేణు మాధవ్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ నెల 6 వ తేదీన అయన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం యశోదా ఆస్పత్రిలో చేర్చారు. నిన్న అయన ఆరోగ్యం మరింత క్షిణించడంతో ఈరోజు మధ్యాహ్నం మృతి చెందారు. దీంతో టాలీవుడ్ ప్రముఖులు అంత వేణుమాధవ్ మృతిపట్ల సంతాపం తెలుపుతున్నారు.                           


మరింత సమాచారం తెలుసుకోండి: