హుజూర్నగర్ ఉప ఎన్నికలో  పెద్ద సంఖ్యలో సర్పంచులు నామినేషన్ వేశారు. సర్పంచుల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు సర్పంచులు ఈ నామినేషన్లు దాఖలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నియోజకవర్గంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపొందారు. అయితే ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా ఉత్తమ్ పోటీ చేసి అక్కడ కూడా గెలుపొందారు. దీంతో ఎంపీగా కొనసాగుతూ ఎమ్మెల్యేగా రాజీనామా చేశారు ఉత్తమ్ .

 

 

దింతో హుజూర్నగర్ ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఈ నేపథ్యంలో  హుజూర్నగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగనుండగా రాష్ట్ర రాజకీయాల చూపు హుజూర్నగర్ నియోజకవర్గం పైనే  ఉంది. హుజూర్ నగర్ నియోజకవర్గం లో ఎలాగైనా విజయం సాధించాలని అన్ని పార్టీలు పావులు  కదుపుతున్నాయి. హుజూర్ నగర్ నియోజకవర్గ ఉప ఎన్నికలను  ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి  అన్ని రాజకీయ పార్టీలు. ఈ నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రచారాలు కూడా మొదలు పెట్టాయి. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ట్రక్కు గుర్తుతో ఇబ్బంది పడ్డామని...ట్రక్కు  గుర్తు వల్లే తెరాస అభ్యర్థికి కొన్ని ఓట్లు మిస్ అయ్యాయని  అందుకే ఓడిపోయామని  ఇప్పటికే తెరాస చెప్పింది. అయితే ప్రస్తుత హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో కూడా తెరాస కి ఇబ్బందులు తప్పేలా లేవు. 

 

 

 

 ఎందుకంటే సర్పంచ్ ల విషయంలో తెరాస ప్రభుత్వ తీరుకు  నిరసనగా హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో సర్పంచ్ లు భారీ సంఖ్యలో  నామినేషన్ వేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర పంచాయతీ సర్పంచ్ల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు 251 మంది సర్పంచులు హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో నామినేషన్ వేయనున్నారు. కేసిఆర్ ప్రభుత్వం సర్పంచులను ఇబ్బందులకు గురి చేస్తున్న తరుణంలో... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన  వ్యక్తం చేస్తున్నామని సర్పంచుల సంఘం ప్రకటించింది. హలో సర్పంచ్... చలో  హుజూర్నగర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 251 సర్పంచ్ లు హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో  నామినేషన్ వేయనున్నట్లు  తెలంగాణ పంచాయతీ సర్పంచ్ల సంఘం ప్రకటించింది. అయితే గతంలో పార్లమెంట్ ఎలక్షన్ ల 

లో కూడా పసుపు రైతులు నిరసన వ్యక్తం చేస్తూ భారీ మొత్తంలో నామినేషన్లు వేసిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో కవిత ఓటమిపాలైంది. మరి ఇప్పుడు సర్పంచ్ నిరసన తెలియజేస్తూ 251 నామినేషన్ వేయగా... టిఆర్ఎస్ గెలుస్తుందా లేదా అనేది మాత్రం ఎన్నికల ఫలితాల తర్వాతే  చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: