చంద్రబాబునాయుడుపై కేంద్రమంత్రి ఆర్కె సింగ్ కు అంత ప్రేమ ఎందుకో అర్ధం కావటం లేదు. చంద్రబాబు హయాంలో జరిగిన విద్యుత్ పిపిఏలను సమీక్ష చేయాలన్న జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని పదే పదే తప్పు పడుతున్నారు. పైగా జగన్ నిర్ణయం దేశంపై తీవ్ర ప్రభావం చూపుతుందని తీవ్ర అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తుండటమే విచిత్రంగా ఉంది.

 

చంద్రబాబు హయాంలో పవన, సౌర విద్యుత్ ను అవసరానికి మించి కొనుగోలు చేయాలని ఒప్పందాలు చేసుకున్నది నిజం. నష్టాల్లో ఉన్న లాంకో, మధుకాన్ లాంటి కంపెనీలకు అత్యధిక ధరలను ఫిక్స్ చేసి దీర్ఘకాల ఒప్పందాలను చంద్రబాబు చేసుకున్నట్లు ఆప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. అవసరం లేకపోయినా పై కంపెనీల నుండి ప్రభుత్వం విద్యుత్ ను కొనుగోలు చేస్తోందని అప్పట్లోనే జగన్ అండ్ కో చాలా ఆరోపణలు చేశారు.

 

సరే అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ పిపిఏలను సమీక్షించాలని జగన్ నిర్ణయించారు. పిపిఏల సమీక్షలో జరిగిన అవినీతిని గుర్తించటానికి ఓ నిపుణుల కమిటిని నియిమించారు. ఆ కమిటి కూడా పలు మార్గాల్లో అధ్యయనం చేసి సుమారు రూ. 5500 కోట్ల దాకా అవినీతి జరిగిందని నిర్ధారించింది. దాంతో సమీక్ష చేయాలని జగన్ డిసైడ్ అయి ఉత్పత్తి కంపెనీలకు నోటిసులు ఇచ్చారు.

 

అప్పటి నుండి ఇటు చంద్రబాబు అటు కేంద్రంలోని ఇద్దరు మంత్రులు పదే పదే జగన్ ను తప్పు పడుతున్నారు. జగన్ నిర్ణయాన్ని చంద్రబాబు తప్పు పడుతున్నారంటే అర్ధం చేసుకోవచ్చు. మరి కేంద్రమంత్రి సింగ్ తో పాటు ధర్మేంద్రప్రధాన్  ఎందుకు తప్పుపడుతున్నారు ?  జగన్ సమీక్షల వల్ల కంపెనీలు ధరలు తగ్గిస్తే రాష్ట్రానికే కదా లాభం. ఒకవేళ జగన్ వైఖరి వల్ల కంపెనీలు పెట్టుబడులు పెట్టకపోతే రాష్ట్రం నష్టపోతుంది. అప్పుడు పారిశ్రామికంగా ఏపినే నష్టపోతుంది.

 

అలాగే జగన్ కు కూడా నష్టమే కదా ? మరి ఈ విషయం జగన్ కు మాత్రం తెలీదా ? అయినా మంత్రులు పదే పదే తప్పు పడుతున్నారంటే తెరవెనుక చంద్రబాబు కోసమే బహిరంగంగా జగన్ ను వ్యతిరేకిస్తున్నట్లు అర్ధమైపోతోంది.  రెండు పార్టీల మధ్య తెరచాటు బాగోతం ఎప్పుడు బయటపడుతుందే ఏమో ?


మరింత సమాచారం తెలుసుకోండి: